Telangana: రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం.. చర్చించబోయే అంశాలివే! రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్ర పునర్విభజన, రైతుల రుణమాఫీకి నిధుల సమీకరణ, ధాన్యం కొనుగోళ్లు, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లు, కొత్త విద్యాసంవత్సరంపై చర్చ జరగనున్నట్లు సమాచారం. By srinivas 17 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినేట్ సమావేశం రేపు (మే18) జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సారధ్యంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ జూన్ 2తో రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండగా పునర్విభజన చట్టానికి సంబంధించి తెలంగాణ-ఏపీ మధ్య అపరిష్కృతంగా పెండింగ్ లో ఉన్న అంశాలపై ప్రధానంగా చర్చజరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆగస్ట్ 15 లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించగా.. నిధుల సమీకరణపై కూడా చర్చించనున్నారు. Also Read: ఆ సొమ్మంతా పేదలకే పంచి పెడతాం.. మోడీ కీలక వ్యాఖ్యలు! రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా.. ఇక రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించి, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళిక గురించి చర్చించనున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినేట్ లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించగా.. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని రేవంత్ నిర్ణయించారని సమాచారం. జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభం కానున్న నేపథ్యంలో స్కూల్, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం. #cm-revanth-reddy #telangana-cabinet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి