Revanth Reddy: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రెండు గ్యారెంటీలు అమలు?

రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించనున్నారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాలకు మంత్రి మండలి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

New Update
Revanth Reddy: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రెండు గ్యారెంటీలు అమలు?

CM Revanth Reddy: రేపు సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం (Telangana Cabinet Meet) సమావేశం కానుంది. ఆరు గ్యారంటీల (6 Guarantees) అమలు చేయడంపై రాష్ట్ర కేబినెట్‌ చర్చించనుంది. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు (Free Current) పథకాలకు మంత్రి మండలి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలోనూ.. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద తెలంగాణలోని మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని (Free Bus Scheme) అందుబాటు లోకి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో 2 కీలక పథకాలను అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టింది కాంగ్రెస్ సర్కార్. ఉచిత విద్యుత్తు పథకం కోసం మొబైల్‌ నెంబర్‌ లింక్‌ చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ కంటే ముందే పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

15 రోజుల్లో 15 వేల ఉద్యోగాలు...

ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిరుద్యోగులకు (Unemployed Youth) శుభవార్త తెలిపారు. వచ్చే 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల (Constable Jobs) భర్తీ చేసే బాధ్యత తమ మంత్రివర్గం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రేవంత్‌ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యచించారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ కేస్లాపూర్ చేరుకున్న ఆయన.. ఆదివాసీల ఇలవేల్పు దైవం నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో రేవంత్‌ ముఖాముఖి నిర్వహించారు.

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు