Telangana Political Updates: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. హస్తం పార్టీలోకి ఆ ఐదుగురు కీలక నేతలు?

బీజేపీకి చెందిన మాజీ ఎంపీలు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఒక వేళ వారు పార్టీ వీడితే కాంగ్రెస్ పార్టీలోనే చేరుతారని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.

New Update
Telangana Political Updates: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. హస్తం పార్టీలోకి ఆ ఐదుగురు కీలక నేతలు?

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఆయా పార్టీల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు పెరిగింది. బీఆర్ఎస్ లో టికెట్ దగ్గని ప్రధాన నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అలాంటి నేతలను గుర్తించి వారి ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు హస్తం పార్టీ ముఖ్య నేతలు. తుమ్మల నాగేశ్వరరావు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేరికలే ఇందుకు నిదర్శనం. తాజాగా బీజేపీ నుంచి హస్తం గూటికి చాలా మంది నేతలు రానున్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి ఇంట్లో ఆ పార్టీ అసంతృప్త నేతలు మూడోసారి భేటీ కావడం కమలం పార్టీలో కలకలం సృష్టిస్తోంది.

భేటీకి మాజీ ఎంపీలు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ భేటీలో కేసీఆర్ పట్ల బీజేపీ తీరుపై తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌పై బీజేపీ వైఖరి ప్రకటించాలని హై కమాండ్‌ ను ఆయా నేతలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్న రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ ప్రకాష్ జవదేకర్‌తో సైతం ఈ విషయమై అసంతృప్త నేతలు భేటీ కాగా.. ఆయన నుంచి సరైన సమాధానం రాలేదని సమాచారం. దీంతో తాడోపేడో తేల్చుకుంటామని ఆయా నేతలు తేల్చిచెబుతున్నట్లు సమచారం.

ఈ సమస్యను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఆలస్యం చేస్తే జిట్టా బాలకృష్ణారెడ్డి మాదిరిగానే ఈ నేతలు కూడా పార్టీ మారే ప్రమాదం ఉందన్న భావన శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.అధిష్టానం నుంచి సానుకూల స్పందన రాకుంటే పార్టీ మారేందుకు సిద్ధమని ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. భేటీలో పాల్గొన్న కొందరు సీనియర్ నేతలు ఇతర పార్టీల ముఖ్యులతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ అసంతృప్త నేతల్లో ఒక్క ఏనుగు రవీందర్ రెడ్డి మినహా మిగతా అందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. దీంతో వీరు పార్టీ మారితే కాంగ్రెస్ లోకే వెళ్లే అవకాశం ఉందన్న చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఇవి కూడా చదవండి: 
Telangana Cabinet: ఈనెల 29న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Advertisment
Advertisment
తాజా కథనాలు