TS BJP: నేడే బీజేపీ ఫైనల్ లిస్ట్.. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు ఎవరు?

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఈ రోజు సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జరిగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ తర్వాత అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.

New Update
TS BJP: నేడే బీజేపీ ఫైనల్ లిస్ట్.. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు ఎవరు?

TS BJP Final List: ఈ రోజు బీజేపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) పోటీ చేయబోయే అభ్యర్థులకు సంబంధించి 2 లిస్ట్ లను విడుదల చేసింది. ఈ లిస్ట్ లలో మొత్తం 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 66 స్థానాల్లో కొన్నింటిని పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇవ్వనుంది బీజేపీ. ఇవి పోగా మిలిగిన స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు ముఖ్య నాయకులు. జనసేనకు (Janasena) 9 లేదా 10 సీట్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన అన్న నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ (Varun Tej) వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లారు.
ఇది కూడా చదవండి: Big Breaking: బీజేపీకి వివేక్ రాజీనామా.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక!

ఆయన తిరిగి వచ్చిన తర్వాతనే జనసేన పోటీ చేసే స్థానాల పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ కు సంబంధించి అంబర్ పేట, ముషీరాబాద్ స్థానాల్లో బీజేపీ (BJP) అనేక సార్లు విజయం సాధించింది. అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి, ముషీరాబాద్ నుంచి లక్ష్మణ్‌ అనేక పర్యాయాలు విజయం సాధించారు. అయితే.. ఈ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు పోటీకి ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ స్థానాల నుంచి ఎవరు పోటీ చేస్తారన్న అంశంపై ఆ పార్టీలో ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: TS Politics: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు?

ముషీరాబాద్ సీటు కోసం గవర్నర్ దత్తాత్రేయ కూతురు విజయ, కార్పొరేటర్ వినయ్ కుమార్ పోటీ పడుతున్నారు. దత్తాత్రేయ కూతురు విజయకే టికెట్ వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి (Kishan Reddy) సతీమణి పోటీ చేస్తారని గతంలో వచ్చాయి. కానీ, ఏమైందో తెలియదు కానీ ఆ ప్రచారానికి బ్రేక్ పడింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు