Telangana BJP:ప్రచారంలో వేగం పెంచుతున్న బీజేపీ...16న మేనిఫెస్టో విడుదల ఎన్నికల ప్రచారంలో వేగాన్ని పెంచింది తెలంగాణ బీజేపీ. అభ్యర్థులను ప్రకటించడం అయిపోవడంతో మేనిఫెస్టో మీద దృష్టిని పెట్టింది. ఈ నెల 16న మేనిఫెస్టోను విడుదల చేయనుంది. By Manogna alamuru 13 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అన్ని రకాలుగా తయారువుతోంది. మొన్నటి వరకు అభ్యర్థులను ప్రకటించడంలో కసరత్తులు చేసిన పార్టీ ఇప్పుడు ప్రజలను ఆకట్టుకోవడం మీద దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగా ప్రచారాన్ని వేగవంతంచేసింది. ఇప్పటికే ప్రధాని, అమిత్ షాలను తెలంగాణకు తీసుకువచ్చి భారీ సభలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు మేనిఫెస్టోను కూడా విడుదల చేయాలని డిసైడ్ అయింది. ఈ నెల 16న బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. Also Read:ఎన్నికల గేమ్ షురూ చేసిన జలగం..కొత్త గూడెంలో ఉత్కంఠత BRS, కాంగ్రెస్ కు భిన్నంగా తమ మేనిఫెస్టో ఉంటుందని చెబుతున్నారు బీజేపీ నేతలు. సంక్షేమ పథకాల కొనసాగిస్తామని ఇప్పటికే కిషన్ రెడ్డి చెప్పారు. దానికి తోడు సెంటిమెంటును జోడించే అంశాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో పలు నగరాల పేర్లు మారుస్తామనే అంశం మేనిఫెస్టో ఉండు అవకాశం ఉంది. అలాగే విద్య, వైద్యం ఉచితంగా అమలు చేస్తామని...జాబ్ క్యాలెండర్ విడుదల, ఉపాధి అవకాశాలపై హామీలు ఉండొచ్చని తెలుస్తోంది. వీటితో పాటూ ప్రతి వ్యక్తికి బీమా పథకం అమలుతో పాటూ వరికి మద్దతు ధర 3100 రూపాయలు పెంచుతామని బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. మరోవైపు 30 ఏళ్లుగా మాదిగలు చేస్తున్న విభజన పోరాటానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi). ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్న ప్రధాని మోదీ.. ఎస్సీల వర్గీకరణ కోసం త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతేకాదు.. ఈ వర్గీకరణకు చట్టపరమైన ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అయితే బీజేపీకి మాత్రం నిరసనల సెగలు తాకుతూనే ఉన్నాయి. పార్టీ నుంచి ఎవరో ఒకరు వరుసగా వెళ్ళిపోతూనే ఉన్నారు. తాజాగా వేములవాడ టికెట్ ను ఇచ్చినట్లు ఇచ్చి ఆఖరి నిమిషంలో మార్చడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న తుల ఉమ ఈ రోజు బీజేపీకి రాజీనామా చేశారు. బీసీ బిడ్డనైన తనకు అన్యాయం చేసినందుకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశారు ఉమ. ముందు వేములవాడ టికెట్ ఉమకే ప్రకటించిన బీజేపీ నామినేషన్ల ఆఖరి రోజు అభ్యర్థిని మార్చింది. దీంతో ఉమ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా ఎదుట కన్నీరు పెట్టారు. బీసీ మహిళకు బీజేపీ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీలో ఇక కొనసాగేది లేదన్న సంకేతాలను ఆ సమయంలోనే ఇచ్చారు ఉమ. ఈ నేపథ్యంలో ఈ రోజు బీజేపీకి రాజీనామా చేశారు. #bjp #telangana-elections-2023 #manifesto మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి