Kishan Reddy: వచ్చేవారంలోనే బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఎంపీ అభ్యర్థులపై తెలంగాణ బీజేపీ కసరత్తు చేస్తోంది. వచ్చే వారంలోనే బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా రానున్నట్లు తెలిపారు.

New Update
Kishan Reddy: వచ్చేవారంలోనే  బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన

TS BJP Chief Kishan Reddy: మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటనపై కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల (BJP MP Candidates) ఎంపిక వచ్చే వారం పూర్తి అవుతుందని అన్నారు. వచ్చే వారం లోనే బీజేపీ అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ సన్నాహాక సమావేశంలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ALSO READ: అలా చేసింది జగనే.. సాక్ష్యం విజయమ్మ.. షర్మిల సంచలన వ్యాఖ్యలు!

దోపిడీ దొంగల పార్టీలు..

కాంగ్రెస్ (Congress Party), బీఆర్ఎస్ పార్టీలు (BRS)... మజ్లీస్ పార్టీని (AIMIM) బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన లేదని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దోపిడీ దొంగల పార్టీలు అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దోషులకు శిక్ష పడుతుందనే విశ్వాసం ప్రజలకు లేదు అని అన్నారు. బీఆర్ఎస్ అవినీతిని కాంగ్రెస్ బయటకు తీస్తుందని ఆశిస్తే అది భంగపడ్డట్లే అవుతుందని అన్నారు.

చెప్పుతో కొట్టే రోజులు..

బీజేపీ అగ్గిలాంటి పార్టీ అని అన్నారు కిషన్ రెడ్డి. బీజేపీపై మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని ఇతర పార్టీలకు సూచించారు. బీఆర్ఎస్– బీజేపీ ఒకటేనని, కాంగ్రెస్–బీజేపీ ఒక్కటేనని మాట్లాడేవాళ్లను చెప్పుతో కొట్టే రోజులు వస్తాయని అన్నారు. తాము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ లో పోటీ చేయడం కోసం కాదు.. అసదుద్దీన్ ను ఓడించడం కోసమే పనిచేయాలని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న ముస్లీం సోదరులు మజ్లీస్ పార్టీని ఓడించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ముస్లీం మహిళలు వద్దన్నా... బీజేపీకి ఓటేయడానికి ముందుకు వస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. మజ్లీస్ పార్టీని వ్యతిరేకించే ప్రతిఒక్కరూ బీజేపీ వైపు రావాలని కోరారు.

తెలంగాణకు అమిత్ షా..

ఈ నెల 28న అమిత్ షా (Amit Shah) తెలంగాణలో పర్యటించనున్నారని తెలిపారు కిషన్ రెడ్డి. 28న సాయంత్రం 5 గంటలకు జేఆర్సీ కన్వేన్షన్ లో ప్రొఫెనల్ మహిళలతో అమిత్ షా మాట్లాడుతారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి సమయం ఇచ్చి కార్యకర్తలు పనిచేయాలని.. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో మజ్లీస్ గెలుస్తుందనే కాలం పోయిందని అన్నారు. ముస్లీంలంతా మజ్లీస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు.

ALSO READ: చంద్రబాబు స్క్రిప్ట్.. షర్మిల వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు