/rtv/media/media_files/swN8aYZewLDu4Tc0A77j.jpg)
ap rains
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు మరోసారి వర్ష సూచన చేసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 7, 8 తేదీల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాట ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
Also Read: Sri Rama Navami 2025: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే
ఏప్రిల్ 7వ తేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది. ఈ జిల్లాల వాసులు వర్షం కారణంగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరింంచింది.
Also Read: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
ఏప్రిల్ 8వ తేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి అని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆదివారం పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ పేర్కొంది. ఇటీవల తెలంగాణలోని చాలా జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. భూమి వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.క్యుములో నింబస్ మేఘాల వల్ల వడగండ్ల వానలు కూడా పడవచ్చని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అకాల వర్షాల కారణంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read:Horoscope: నేడు ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు!
Also Read:Vontimitta Kodandarama Swamy Temple: హనుమంతుడి లేని రామాలయం..మన దగ్గరే..ఎన్నో ప్రత్యేకతలు!
telangana | weather | telangana-weather | telangana weather news | telangana weather report today | telangana weather updates | telangana-weather-report | telangana-weather-update | imd alert heavy rains to telangana | weather updates | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates
దుబ్బాక కారుదా, కమలానిదా..! రెండోసారి గెలుపు కోసం శ్రమిస్తున్న రఘునందన్
బీఆర్ఎస్ కంచుకోటల నడుమ ఉన్న దుబ్బాకలో ఎలాగైనా మళ్లీ గెలవాలని రఘునందనరావు సర్వశక్తులూ ఒడ్డుతుండగా, వ్యూహాత్మకంగా తమకు కీలకమైన స్థానాన్ని చేజిక్కించుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది. తాజాగా రఘునందన్ కు మద్దతుగా మందకృష్ణ ప్రచారం చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
Dubbaka: ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గం దుబ్బాక. బీఆర్ఎస్ కు దుర్భేద్యమైన స్థానాలుగా ఉన్న సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాలకు అతి సమీపంలో ఉన్న దుబ్బాక ఉపఎన్నికలో కమలం పాగా వేయడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్వల్ప ఆధిక్యంతోనే అయినా బీజేపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడంతోనే కమలదళంలో జోరు మొదలైంది. బీఆర్ఎస్ కు వ్యూహాత్మకంగా కీలకంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మాటల మాంత్రికుడు రఘునందనరావు (Raghunandan Rao) మరోసారి బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా; ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డిని అధికార బీఆర్ఎస్ బరిలోకి దింపింది. కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీపడుతున్నారు. ఈ దఫా కూడా గెలిచి తీరాలని రఘునందనరావు పట్టుదలతో ఉండగా; ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీటు కోల్పోవద్దని బీఆర్ఎస్ నిశ్చయించుకుంది. ప్రభాకరరెడ్డిపై దాడితో దుబ్బాక ఒక్కసారిగా మరోసారి రాష్ట్రస్థాయిలో వార్తల్లో నిలిచింది. ప్రధాన పోటీ ఆ రెండు పార్టీల మధ్యే ఉన్నట్లు భావిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభావాన్నీ అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.
ఇది కూడా చదవండి: రఘునందన్ ఎక్కడ? దుబ్బాక ఎందుకు దాటడం లేదు?
విజయం కోసం రఘునందనరావు సర్వశక్తులూ ఒడ్డి ప్రయత్నిస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు పేరిట ఆయన ప్రచారంలో ముందుకెళ్తుండగా, ఏ అవకాశాన్నీ వదలుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేరు. మంత్రులు హరీశ్ రావు (Harish Rao), కేటీఆర్ (KTR) ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఉపఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ (BRS) నేతలు ప్రచారంలో విమర్శిస్తున్నారు. బీజేపీ ఈసారి కూడా ఒకే సీటుకు పరిమితం కావడం ఖాయమని హరీశ్ జోస్యం చెప్పగా; తాము తిరిగి అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములన్నింటికి పట్టాలిస్తామని ప్రచారంలో కేటీఆర్ హామీ ఇచ్చారు. రఘునందన్ పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేయగా, పాటలను కూడా వదలకుండా కాంగ్రెస్ తమను కాపీ కొడుతోందని హరీశ్ సెటైర్లు వేశారు. దీనిపై రఘునందనరావు కూడా గట్టిగానే స్పందించారు. గత ఉప ఎన్నికలో హరీశ్ రావు మాదిరిగానే, ఈ సారి కేటీఆర్ ను పరుగెత్తించడం ఖాయమన్నారు. 173 ఓట్లతో గెలిచిన కేటీఆర్ వెయ్యి ఓట్లతో గెలిచిన తనను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతున్నారు.
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డితో పాటు ఆ నాయకులపై ట్రాఫిక్ చలాన్లు ఎంతున్నాయో తెలుసా!
రఘునందన్ కు మందకృష్ణ మాదిగ మద్దతు:
రఘునందన్ రావును ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని తాజాగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. పరేడ్ గ్రౌండ్ లో విశ్వరూప మహాసభ అనంతరం తెలంగాణ సామాజిక సమీకరణాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయన్న విశ్లేషణల నేపథ్యంలో మందకృష్ణ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. సామాజిక న్యాయం మోదీతోనే సాధ్యమన్నారు మందకృష్ణ.
ఇదిలా ఉంటే, రాష్ట్రస్థాయి చరిష్మా ఉన్న రఘునందనరావు నియోజకవర్గానికే పరిమితమై మరీ గెలుపు కోసం శ్రమిస్తుండగా, సర్వశక్తులూ ఒడ్డి దుబ్బాక తమకు పక్కలో బళ్లెంగా మారకుండా చూసుకోవాలని భావిస్తోంది బీఆర్ఎస్.
Rain Alert: మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాల వాసులకు హెచ్చరికలు!
తెలంగాణలో మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.7, 8 తేదీల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపింది.సూర్యాపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.Short News | Latest News In Telugu | నల్గొండ | వరంగల్ | తెలంగాణ
Colon Cancer: పెరుగు తింటే పెద్ద పేగు క్యాన్సర్ రాదా.. నిజమెంత?
పెరుగులో బైఫిడో బాక్టీరియం ఉంటుంది. పెరుగు తినే వ్యక్తులకు ప్రాక్సిమల్ కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
MS Dhoni IPL Retirement: ధోనీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. IPLకి ధోనీ గుడ్ బై..?
MS ధోని ఐపీఎల్ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ అనంతరం అతడు రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడని పోస్టులు చక్కర్లు కొట్టాయి. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Jofra Archer: ఆర్చర్ విధ్వంసం.. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
USA: అమెరికాకు సుంకాల దెబ్బ..ధరల పెరుగుతాయని స్టోర్లకు పరుగెడుతున్న జనాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు ప్రపంచ మొత్తంతో పాటూ సొంత దేశ ప్రజలను కూడా భయపెడుతున్నాయి. సుంకాల వలన ధరలు పెరుగుతాయనే ఆందోళనతో జనాలు స్టోర్లకు పరుగులు పెడుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
CRIME NEWS: అయ్యో పాపం.. ఫిబ్రవరిలో నిశ్చితార్థం- రోలర్ కోస్టర్ నుంచి కిందపడి యువతి స్పాట్‌డెడ్!
ఢిల్లీలో 24 ఏళ్ల యువతి రోలర్ కోస్టర్ నుంచి కింద పడి మృతి చెందింది. ప్రియాంకకు నిఖిల్‌తో ఫిబ్రవరిలో నిశ్చితార్థం అయింది. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
🔴Live News: ఏపీలో ఘోర విషాదం.. గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ..
క్రికెట్ బెట్టింగ్‌కు బలైన మరో యువకుడు ఆత్మహత్య
Accident: ఏపీలో ఘోర విషాదం.. గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ..!
Alekhya Chitti Pickles Issue: మొత్తానికి అలేఖ్య పాపని ఏడిపించేశారు కదరా.. వెక్కి వెక్కి ఏడుస్తున్న చిట్టి (వీడియో వైరల్)
USA: అమెరికాకు ఎగుమతులను ఆపేస్తున్న బడా కంపెనీల కార్లు..జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రేక్