టీఎస్‌ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. సమావేశాలు నిరవధిక వాయిదా టీఎస్‌ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఇవాళ సాయంత్రం ఆర్టీసీ బిల్లుపై చర్చ జరిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. అనంతరం బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. దీంతో గత రెండు రోజులగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లైంది. By Karthik 06 Aug 2023 in హైదరాబాద్ New Update షేర్ చేయండి టీఎస్‌ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఇవాళ సాయంత్రం ఆర్టీసీ బిల్లుపై చర్చ జరిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. అనంతరం బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. దీంతో గత రెండు రోజులగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లైంది. బిల్లు ఆమోదం పొందడంతో ఆర్టీసీ కార్మికుల జీవితాలకు ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లైంది. గత రెండు రోజుల క్రితమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. దానిపై చర్చ జరిపిన స్పీకర్ ఆమోదం తెలిపారు. అనంతరం బిల్లు కాపీ గవర్నర్ వద్దకు వెళ్లగా గవర్నర్ బిల్లును తిరస్కరించారు. దీంతో రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు గంటల పాటు బంద్ పాటించి డిపోల ఎదుట ధర్నాకు దిగారు. తాము ఎన్నో సంవత్సరాలు కష్ట పడుతూ వస్తున్నామని, ఇన్నాళ్లకు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎం ప్రకటిస్తుంటే గవర్నర్ మాత్రం అందుకు ఒప్పుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. గవర్నర్ రాజ్‌భవన్‌లో ఉండి రాజకీయాలు చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు మండిపడ్డారు. ప్రధాని మోడీ చెప్పినట్లు గవర్నర్ నడుచుకుంటున్నారని విమర్శించారు. రాజ్యాంగ బద్ద హోదాలో ఉన్న వ్యక్తి రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు గవర్నర్ తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకుంటామని, ఆర్టీసీ కార్మికుల జీవితాలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వస్తే.. గవర్నర్ ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల కష్టాలు గవర్నర్‌కు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం కోసం సకల జనుల సమ్మెలో పాల్గొని ఎంతో మంది జీతాలు లేకుండా కాలం ఎల్లబోసుకున్నారని సీఎం గుర్తు చేశారు. అలాంటి కార్మికులను గుర్తించి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల్లోకి వెళ్తుందని, కార్మికుల జీవితాలు సైతం వెలుగుల్లోకి వస్తాయని కేసీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులో ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి లాభాలు చేకూర్చే అంశాలు లేవని గవర్నర్ తమిళిసై అన్నారు. అంతే కాకుండా.. ఆర్టీసీ కార్మికులకు పదవి విరమణ అనంతరం ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లు పింఛన్‌ను అందిస్తుందా ? అని ప్రశ్నించారు. దీంతో రాజ్ భవన్‌లో గవర్నర్‌తో సమావేశమైన ఆర్టీసీ అధికారులు ఆమెకు ఆర్టీసీ విలీనంపై ఉన్న అన్ని సందేహాలపై వివరణ ఇచ్చారు. అనంతరం గవర్నర్ తమిళిసై బిల్లుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు. ఆర్టీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపినట్లు ప్రకటించిన స్పీకర్.. అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. #telangana #tsrtc #assembly #approval మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి