బీజేపీకి మంచి ఫలితాలొస్తాయి. ధీమా వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలొస్తాయని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు కేసీఆర్ చెప్పినట్లే నడుచుకున్నారని విమర్శించారు. నాగార్జున సాగర్ సంఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ శ్రేణులపై దాడులు జరిగాయని ఆరోపించారు.

New Update
బీజేపీకి మంచి ఫలితాలొస్తాయి. ధీమా వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి

తెలంగాణలో పోలింగ్ ముగియగానే బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలొస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అలాగే బీఆర్ఎస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని, అయినా బీఆర్ఎస్ గుండాయిజానికి బయపడకుండా తమ పార్టీ శ్రేణులు పార్టీ విజయం కోసం కష్టపడ్డారన్నారు. ఇక పోలీసులు కేసీఆర్ చెప్పినట్లే నడుచుకున్నారని, సిగ్గు విడిచి, బరితెగించి బీజేపీ కార్యకర్తలపై దాడులు చేశారని మండిపడ్డారు. కళ్లముందు మద్యం, డబ్బు పంచుతున్నా పోలీసులు చూస్తూ ఊరుకున్నారని ఆరోపించారు.

Also read :Peoples Pulse Survey: ఎగ్జిట్‌ పోల్స్‌లో కాంగ్రెస్‌దే హవా..!

ఇక దీక్షా దీవాస్ పేరుతో బీఆర్ఎస్ సెంటిమెంట్ ను రెచ్చగొట్టిందన్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ సంఘటనను పూర్తిగా ఖండిస్తున్నా. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఏపీకి తాగునీరు ఇవ్వడాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ అనుమతిలేకుండా గేట్లు ఎత్తేసి తీసుకుపోవడం మంచిది కాదు. సమస్యను పరిష్కారం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పత్రిక ప్రకటనల ద్వారా బీజేపీ మీద బురదజల్లే ప్రయత్నం చేసిందని చెప్పారు. పలుచోట్లు దాడులకు కూడా పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సమర్థవంతంగా మాకున్న శక్తి మేరకు పనిచేశాం. మాకు అనుకూలంగా ఫలితాలొస్తాయని ఆశిస్తున్నామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు