Suicide: ఇంకా ఎన్ని చూడాలి.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య..

రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఏడాది జనవరిలో ఇది రెండో ఆత్మహత్య కావడం ఆందోళన కలిగిస్తోంది. జేఈఈ పరీక్షకు కోచింగ్ తీసుకుంటున్న నిహారిక(18) అనే అమ్మాయి తాను జేఈఈ చేయలేనంటూ సూసైడ్‌ నోట్ రాసి తన గదిలో ఆత్మహత్య చేసుకుంది.

New Update
Crime: హాస్టల్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల మరణాలు ఈ ఏడాది కూడా కొనసాగుతున్నాయి. గత ఏడాది ఇక్కడ ఏకంగా 29 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుని చనిపోవడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో ఓ విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కోటాలని శిక్షా నగ్రి అనే ఏరియాలో ఉంటున్న నిహారిక(18) అనే అమ్మాయి జేఈఈ మెయిన్స్‌ పోటీ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటోంది.

Also Read:  ప్రియురాలిని తుపాకితో కాల్చి చంపిన ప్రియుడు..

నేను జేఈఈ చదవలేను

జనవరి 31న ఆమె రాయాల్సిన జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ఉంది. కానీ జేఈఈ పరీక్షకు సిద్ధం కావడం తనవల్ల కాకపోవడంతో చివరికి తన గదిలో ఉరేసుకొని చనిపోయింది. అంతేకాదు ఆమె చనిపోయే ముందు ఓ సూసైడ్‌ నోట్‌ కూడా రాసింది. ఆ లేఖలో ' నాన్న నేనొక వరస్ట్‌ కూతురుని. నేను జేఈఈ చదవలేను. ఆత్మహత్య చేసుకుంటున్నా. నేను లూసర్‌ని, వరస్ట్‌ కూతురుని. క్షమించండి అమ్మ నాన్న ఇది నా చివరి ఆప్షన్ అంటూ' రాసింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో ఇది రెండో విద్యార్థి ఆత్మహత్య కావడం ఆందోళన రేపుతోంది.

గత ఏడాది 29 మంది ఆత్మహత్య

ఇదిలాఉండగా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్‌ జైద్‌ (18) అనే విద్యార్థి కోటాలో నీట్‌ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. కానీ ఒత్తిడిని తట్టుకోలేక జనవరి 23న అతడు తన హాస్టల్‌ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. అయితే గత ఏడాది కోటాలో 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కోచింగ్‌ సెంటర్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, మానసిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆత్మహత్యలు ఆగిపోవడం లేదు.

Also Read: డిగ్రీ అర్హతతో ‘ఎన్‌ఆర్‌ఎస్‌సీ’లో ఉద్యోగాలు.. అప్లికేషన్ వివరాలివే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

గుజరాత్‌లో మంగళవారం విమానం కూలిపోయి పైలట్ మరణించాడు. అమ్రేలి జిల్లా గిరియా ప్రాంతంలో ఓ ప్రైవేట్ ప్లేన్ క్రాష్ అయ్యింది. ట్రైనీ పైలట్ సోలో అనికేత్ మహాజన్ అక్కడికక్కడే మరణించాడు. ఫ్లైట్‌లో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
plane crash 123

గుజరాత్‌లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమ్రేలి జిల్లా గిరియా ప్రాంతంలో ఓ ప్రైవేట్ ప్లేన్ కుప్పకూలిపోయింది. విమానం కూలిపోగానే భారీ పేలుడు సంభవించింది. ప్రైవేట్ కంపెనీ పైలట్ ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రైనీ పైలట్ సోలో అనికేత్ మహాజన్ అక్కడికక్కడే మరణించాడు. ఫ్లైట్‌లో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

ప్లేన్ క్రాష్ అవ్వడంతో చుట్టుపక్కల ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. అగ్నిమాపక శాఖ, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కొంతకాలం క్రితం ట్రైనీ లేడీ పైలట్‌ నడుపుతున్న విమానం మెహ్సానాలోని ఒక గ్రామ శివార్లలో కూలిపోయింది. ఆప్రమాదంలో ఆ మహిళా పైలట్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.

 

Advertisment
Advertisment
Advertisment