Summer AC Tips: ఏసీ వాడుతున్నా కరెంట్ బిల్లు రాకూడదా?.. ఈ జంతర్ మంతర్ టిప్స్ పాటిస్తే చాలు..!

సమ్మర్‌లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న తరుణంలో చాలా మంది ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎండ వేడికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఏసీ గాలిలో ఉపశమనం పొందేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

New Update
AC TIPS

AC TIPS

సమ్మర్ సీజన్ వచ్చేసింది. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం కాగానే విజృంభిస్తున్నాడు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న తరుణంలో చాలా మంది ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎండ వేడికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఏసీ గాలిలో ఉపశమనం పొందేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అక్కడ వరకు ఓకే.. కానీ ఏసీని సరైన క్రమంలో ఉపయోగించకపోతే మాత్రం.. చల్లని గాలి రాకపోవడమే కాకుండా కరెంటు బిల్లు కూడా మోతమోగిపోతుంది. అందువల్ల ఏసీ నుంచి చల్లని గాలి రావాలన్నా, కరెంట్ బిల్లు తక్కువగా ఉండాలన్నా కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. అవేంటో తెలుసుకుందాం. 

ఫిల్టర్ల క్లీనింగ్

ఏసీ సరిగ్గా పనిచేయాలంటే ఫిల్టర్ల క్లీనింగ్ చాలా ముఖ్యం. గాలిలోని ధూళి కణాలు ఫిల్టర్లలో పేరుకుపోవడం వల్ల గాలి ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల కంప్రెసర్‌పై ఎక్స్‌ట్రా భారం పడి గాలి అనేది చల్లగా రావడం తగ్గుతుంది. అందువల్ల ప్రతి 2 వారాలకోసారి ఏసీ ఫిల్టర్లను క్లీన్ చేసుకోవాలి. 

సరైన టెంపరేచర్‌ను సెట్ చేయడం

చాలా మంది ఎండ వేడికి ఏసీని 16 లేదా 18 డిగ్రీల వరకు ఉంచుతారు. ఇలా చేస్తే గది చల్లబడి హాయ్ హాయ్‌గా ఉంటుందని భావిస్తారు. అయితే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ప్రకారం.. ఏసీని ఇలా ఉంచడం వల్ల గది చల్లబడినా.. కరెంట్ బిల్లు మాత్రం మోగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. సాధారణంగా ఏసీని 24 డిగ్రీల వద్ద ఉంచడం మంచిదని.. ఇలా చేయడం వల్ల మానవ శరీరానికి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా కరెంట్ కూడా ఆదా అవుతుందని చెబుతున్నారు. ప్రతి ఒక్క డిగ్రీ పెరిగే కొద్ది దాదాపు 6 శాతం కరెంట్ ఆదా అవుతుంది. 

గది డోర్లు క్లోజ్ చేయడం

ఏసీ ఆన్ చేసే ముందు గది తలుపులు, కిటికీలు క్లోజ్ చేయడం మంచిది. ఒకవేళ ఎక్కడైనా ఖాళీ ఉంటే అందులోంచి చల్లటి గాలి బయటకుపోయి.. గది చల్లబడటానికి చాలా సమయం పడుతుంది. దీని వల్ల ఏసీ వాడకం ఎక్కువై కరెంట్ బిల్లు పెరిగిపోతుంది. 

సీలింగ్ ఫ్యాన్‌ ఉపయోగించడం

ఏసీ ఆన్ చేసిన తర్వాత సీలింగ్ ఫ్యాన్ కూడా తక్కువ స్పీడ్‌లో ఉపయోగించడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల ఏసీ నుంచి వచ్చే గాలి గదిలోని మూలమూలలకు చేరుతుంది. దీంతో రూమ్ మొత్తం చల్లగా ఉంటుంది. 

టైమర్ సెట్ చేయడం

సాధారణంగా అర్థరాత్రి దాటిన తర్వాత వాతావరణం చల్లబడుతుంది. అప్పుడు కూడా ఏసీ ఆన్‌లో ఉంటే గది మరింత కూల్ అవుతుంది. కాబట్టి అలాంటి సమయంలో ఏసీ ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా టైమర్ సెట్ చేసుకుంటే మంచిది. దీనివల్ల కరెంట్ బిల్లు చాలా వరకు తగ్గుతుంది. 

ఈ టిప్స్ పాటించడం వల్ల ఈ సమ్మర్ సీజన్‌లో ఏసీ కూలింగ్‌ను ఎంజాయ్ చేయడమే కాకుండా కరెంట్ బిల్లులు తగ్గించుకోవచ్చు. 

Advertisment
తాజా కథనాలు