/rtv/media/media_files/2025/04/05/OFuw7ROWeXk8aS22e2cb.jpg)
Poco C71 Launched in India Rs 6,499
Poco C71 స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో భారతదేశంలో లాంచ్ అయింది. ఇది 6.88-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ TUV రైన్‌ల్యాండ్ ఐ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది Unisoc T7250 SoCలో పని చేస్తుంది. గరిష్టంగా 6GB RAMతో వస్తుంది.
Also read: పెళ్లైన తెల్లారే జంప్.. ఇప్పటికే ముగ్గురితో మూడు ముళ్లు!
Poco C71 Price
భారతదేశంలో Poco C71 ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో బేస్ 4GB + 64GB కాన్ఫిగరేషన్ ధర రూ.6,499 నుండి ప్రారంభమవుతుంది. అలాగే 6GB + 128GB వేరియంట్ ధర రూ.7,499గా కంపెనీ నిర్ణయించింది. ఈ హ్యాండ్‌సెట్ డెసర్ట్ గోల్డ్, కూల్ బ్లూ, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. Poco C71 సేల్ ఏప్రిల్ 8 నుండి ప్రారంభమవుతుంది.
Also Read : అయ్యో తల్లి.. నవరాత్రుల కోసం ప్లాన్.. పీరియడ్స్ రావడంతో సూసైడ్!
దీనిని ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ Flipkart నుంచి కొనుక్కోవచ్చు. మొదటి సేల్‌లో పలు ఆఫర్‌లు కూడా ఉన్నాయి. వాటిలో అత్యంత ఆకర్షణీయమైన ఆఫర్‌లు Airtel ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం అందించబడ్డాయి. వారు Poco C71ని కేవలం రూ. 5,999 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఎక్స్‌ట్రాగా 50GB డేటా ప్రయోజనాలు లభిస్తాయి.
Also read : నీ అభిమానం సల్లగుండా.. పవన్ కోసం రక్తం చిందించిన అభిమాని.. ఏం చేశాడంటే?
Poco C71 Features
Poco C71 ఫోన్ Android 15 పై నడుస్తుంది. వినియోగదారులు రెండు సంవత్సరాల Android OS అప్‌డేట్‌లను, నాలుగు సంవత్సరాల సెక్యురిటీ ప్యాచ్ అప్డేట్‌లను పొందుతారు. Poco C71 6.88-అంగుళాల HD+ (720x1,640 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో తక్కువ బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ, సిర్కాడియన్ వంటి సర్టిఫికేషన్ అందించారు. అంతేకాకుండా ఇది Unisoc T7250 SoC ద్వారా ఆధారితం అయింది.
Poco C71 ఫోన్ 32 మెగా పిక్సెల్‌తో డ్యూయల్ బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుంది. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. Poco C71 ఫోన్ 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికొస్తే.. ఇది 4G VoLTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, GPS, FM, బ్లూటూత్ 5.2, USB టైప్-C పోర్ట్‌తో సహా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
(latest-telugu-news | telugu-news | mobile-offers)