Meta యూజర్లకు బిగ్ షాక్: నిలిచిపోయిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవలు!

ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా అకస్మాత్తుగా నిలిచిపోయాయి. మెటా యాజమాన్యంలోని ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లలో సర్వర్ సమస్యలు తలెత్తడంతో.. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

New Update
meta

ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా అకస్మాత్తుగా నిలిచిపోయాయి. మెటా యాజమాన్యంలోని ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లలో సర్వర్ సమస్యలు తలెత్తడంతో.. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ సమస్య మొదలైంది. ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ లో ఒక్కసారిగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 

యూజర్లు ప్రధానంగా యాప్స్ అస్సలు లోడ్ కాకపోవడం. ఫీడ్స్ రిఫ్రెష్ కాకపోవడం, పాత పోస్టులే కనిపిస్తూ ఉండడం, కొత్త కంటెంట్ లేదా రీల్స్ అప్‌లోడ్ కాకపోవడం, లాగిన్ అవ్వడంలో ఇబ్బందులు తలెత్తడం వంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు. కొందరికి వెబ్‌సైట్ వెర్షన్ పనిచేస్తున్నప్పటికీ, మొబైల్ యాప్స్ మాత్రం పూర్తిగా స్తంభించిపోయాయి.

గ్లోబల్ ఔటేజ్ అని

ఇండియాలోని ప్రధాన నగరాలతో పాటు అమెరికా, కెనడా, సింగపూర్, నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్ వంటి అనేక దేశాల్లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవలకు అంతరాయం ఏర్పడింది. లోకల్ ఇంటర్నెట్ ప్రాబ్లం కాదని, ఇది గ్లోబల్ ఔటేజ్ అని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనితో యూజర్లంతా ఎక్స్ వేదికగా తమకు ఎదురవుతున్న ఇబ్బందులను పంచుకుంటున్నారు. కాగా ఈ భారీ అంతరాయంపై మెటా సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు

Advertisment
తాజా కథనాలు