/rtv/media/media_files/2026/03/30/most-runs-wicket-keeper-in-ipl-5-2026-03-30-15-08-43.jpg)
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అదిరిపోయే సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘flipkart big bachat days’ పేరుతో కొత్త సేల్‌ను ఇవాళ ప్రారంభించింది. ఈ సేల్ మార్చి 30 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో పలు ప్రొడెక్టులను అతి తక్కువ ధరకే భారీ డిస్కౌంట్‌తో పొందొచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వంటి వాటితో ప్రొడెక్టులను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
flipkart big bachat days sale
ఈ flipkart big bachat days సేల్‌లో ప్రజలకు ప్రతి రోజూ అవసరమైన హెల్త్ కేర్ ఉత్పత్తులపై 20 శాతం తగ్గింపు ఉంది. అలాగే సమ్మర్ స్కిన్ కేట్ అండ్ బ్యూటీ ప్రొడెక్టులపై 80 శాతం వరకు భారీ తగ్గింపు పొందొచ్చు. ఇంకా పూమా, అడిడాస్ వంటి బ్రాండెడ్ కంపెనీల షూలపై 65 శాతం డిస్కౌంట్, సమ్మర్ మేకప్ ఉత్పత్తులపై 70 శాతం, నాయిస్ ఇయర్ బడ్స్‌పై 71 శాతం లభిస్తుంది. దీంతో పాటు మరెన్నో ప్రొడెక్టులను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.
ఈ సేల్‌లో boAt Airdopes 181 Pro పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రూ.5వేల ధర కలిగిన ఎయిర్‌పాడ్స్ కేవలం రూ.1000లకే పొందొచ్చు. దీని అసలు ధర రూ.4,990గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు దీనిపై ఫ్లిప్‌కార్ట్‌లో 78 శాతం భారీ తగ్గింపు ఉంది. దీంతో ఈ ఎయిర్‌పాడ్స్ కేవలం రూ.1,099లకే సొంతం అవుతుంది. ఈ ఇయర్ బడ్ 100 గంటల ప్లే బ్యాక్ సమయాన్ని అందిస్తుంది.
Follow Us