/rtv/media/media_files/2025/04/13/dn18EYQNEM5KuBUkvAzC.jpg)
DOOGEE S200 Plus
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ DOOGEE తాజా DOOGEE S200 ప్లస్ ఫోన్‌ను విడుదల చేసింది. ప్రపంచంలోనే వెనుక భాగంలో కూడా AMOLED డిస్‌ప్లే ఉన్న మొట్టమొదటి ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ దృఢంగా ఉండటమే కాకుండా అనేక ఫీచర్లను కలిగి ఉందని కంపెనీ చెబుతోంది. ఇది IP68, IP69K, MIL-STD-810H సర్టిఫికేషన్ కలిగి ఉంది. దీని కారణంగా ఈ ఫోన్ 2 మీటర్ల లోతు నీటిలో 24 గంటలు ఉన్నా ఏం కాకుండా ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల ప్రధాన డిస్‌ప్లే ఉంది. ఇది FullHD ప్లస్ IPS ప్యానెల్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. ఇందులో 10,100mAh బ్యాటరీ అందించారు.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
DOOGEE S200 Plus Price
DOOGEE S200 ప్లస్ ధర $529.99 (సుమారు రూ. 45,000)గా ఉంది. ఈ ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ doogee.com నుండి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్‌ను Amazon.com లో కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
DOOGEE S200 Plus Specifictions
DOOGEE S200 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల FHD+ IPS ప్రధాన డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అలాగే వెనుక భాగంలో 1.32-అంగుళాల AMOLED డిస్ప్లే ప్యానెల్ ఉంది. ఇది 466 × 466 పిక్సెల్స్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఈ డిస్ప్లే ద్వారా వినియోగదారులు YouTube వీడియోలను చూడవచ్చు.
ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 5G కనెక్టివిటీ ఉంది. కంపెనీ ఫోన్‌లో 32 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించింది. TF కార్డు ఉపయోగించి స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ 10,100mAh భారీ బ్యాటరీతో వస్తుంది. దీనితో పాటు కంపెనీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతును కూడా అందించింది. అలాగే ఈ ఫోన్ 18W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. ఫోన్‌లో 100MP ప్రధాన కెమెరా ఉంది. ఇది AI ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. ఫోన్‌లో 20MP నైట్ విజన్ సెన్సార్ కూడా ఉంది. మూడవ లెన్స్ 2MP మాక్రో లెన్స్ ఉంది. ఈ కెమెరాతో అనేక AI ఫీచర్లకు మద్దతును అందించింది. వీటిలో AI ఎరేస్, AI బ్యాక్‌గ్రౌండ్ రీప్లేస్‌మెంట్, AI పోర్ట్రెయిట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
(mobile-offers | 5G Smart Phone | smart-phone | latest-telugu-news | telugu-news)