AI మాయ.. మీ కుక్కలు ఇక మాట్లాడుతాయ్.. ఎలానో తెలుసా?

పెంపుడు జంతువుల భాషను అర్థం చేసుకోవడం కష్టం. అయితే ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు పెట్టిచాట్ అనే కంపెనీ ఒక సరికొత్త పరికరాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది.

New Update
FotoJet (14)

పెంపుడు జంతువుల భాషను అర్థం చేసుకోవడం కష్టం. అయితే ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు పెట్టిచాట్ అనే కంపెనీ ఒక సరికొత్త పరికరాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. పిల్లులు, కుక్కలు అరిచే శబ్దాలను విశ్లేషించి వాటికి అనుగుణంగా మనిషి భాషలోకి అనువదించనుంది. ఈ పరికరం పిల్లులు, కుక్కల వివిధ రకాల శబ్దాలు, వాటి శరీర కదలికలు, ప్రవర్తనను వీడియో ద్వారా పరిశీలిస్తుంది. 10 లక్షలకు పైగా జంతువుల డేటా పాయింట్లను ఉపయోగించి.. AI సహాయంతో కేవలం 1.2 సెకన్లలోనే అది ఏం చెప్పాలనుకుంటుందో దాన్ని చెబుతుంది. ఉదాహరణకు నాతో ఆడుకో, నన్ను ఒంటరిగా వదిలేయ్, నాకు ఇది నచ్చలేదు వంటి అర్థాలను కూడా ఆ పరికరం తెలియజేస్తుంది. 

ఇది కూడా చూడండి: Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి ఊహించని షాక్.. ఆందోళనలో మూవీ టీమ్!

ఎడిటింగ్ అని డౌట్..

అయితే కంపెనీ విడుదల చేసిన డెమో వీడియోలు చూసిన తర్వాత చాలా మందిలో సందేహాలు మొదలయ్యాయి. ఆ వీడియోల్లో పెంపుడు జంతువులు చేసే శబ్దాలకు వస్తున్న అనువాదాలు చాలా స్పష్టంగా, మనుషులు మాట్లాడే విధంగా ఉన్నాయి. దీంతో కొందరు వీడియో ఎడిటింగ్ సమయంలో కావాలనే కృత్రిమ గొంతులను జత చేసి ఉంటారని డౌట్ పడ్డారు. ఇవి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని సన్నివేశాల్లా ఉన్నాయి తప్ప.. నిజమైన సాంకేతికతలా అనిపించడం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Total Fertility Rate : భారత్‌లో పడిపోతున్న జననాల రేటు (TFR)..... చైనా బాటలో దేశం.. ఆందోళనలో నిపుణులు!

ప్రస్తుతం ఈ పరికరాన్ని లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. దీని అసలు ధర సుమారు రూ.18 వేలు ఉండగా.. డిస్కౌంట్‌తో రూ.14,300లకు అందుబాటులో ఉంచారు. గోధుమ, గులాబీ, వెండి రంగుల్లో లభించే ఈ పరికరానికి మే 1 నుండే ప్రీ-ఆర్డర్లు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 10,000 మంది దీనిని రిజర్వ్ చేసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు