Smart Tv Offers: IPL కోసం బిగ్గెస్ట్ 55 ఇంచుల స్మార్ట్‌టీవీ.. ఆఫర్ చూస్తే ఇప్పుడే కొనేస్తారు!

ఐపీఎల్ మ్యాచ్‌ను పెద్ద స్క్రీన్‌లో చూడాలనుకుంటే మీకో గుడ్‌న్యూస్. అమెజాన్ 55 ఇంచుల స్మార్ట్ 4కె టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్‌లు అందిస్తోంది. శాంసంగ్, రెడ్ మీ, ఎల్‌జీ వంటి బ్రాండెడ్ టీవీలను భారీ డిస్కౌంట్‌లతో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

New Update
Amazon offering great deals on 55 inch screen Smart TVs

Amazon offering great deals on 55 inch screen Smart TVs

ఐపీఎల్ ప్రారంభం అయిపోయింది. క్రికెట్ ప్రియులంతా టీవీలకు, మొబైళ్లకు అతుక్కుపోయారు. అయితే మీరు ఈ ఐపీఎల్ మ్యాచ్‌ను ఒక పెద్ద స్క్రీన్‌లో చూడాలనుకుంటే ఇదే సరైన అవకాశం. ఎందుకంటే 55 ఇంచుల స్మార్ట్‌టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్.. 55 అంగుళాల స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీలు అద్భుతమైన వీక్షణను, అదిరిపోయే సౌండ్ క్వాలిటీను అందిస్తాయి. అందువల్ల తక్కువ ధరలో భారీ ఆఫర్లతో అందుబాటులో ఉన్న 55 ఇంచుల స్మార్ట్‌టీవీల గురించి తెలుసుకుందాం.

Also Read: కర్నూలులో దారుణ హత్య. వేట కొడవళ్లతో వెంబడించి.. షాకింగ్ వీడియో!

Samsung 55 ఇంచుల 4K అల్ట్రా HD స్మార్ట్ LED TV

శామ్సంగ్ 55 ఇంచుల 4K అల్ట్రా HD స్మార్ట్ LED TVపై అమెజాన్‌లో కిక్కిచ్చే డిస్కౌంట్ అందుబాలో ఉంది. దీని ధర రూ.64,900 ఉండగా.. ఇప్పుడు మీరు ఈ టీవీని కేవలం రూ.43,990కు సొంతం చేసుకోవచ్చు. HDFC క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్‌తో టీవీపై రూ.1500 అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే ICICI క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్‌తో రూ.2000 డైరెక్ట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది మాత్రమే కాదు.. ఈ టీవీపై రూ. 2000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అలాగే నెలకు రూ. 4,416 చెల్లించి నో కాస్ట్ EMI కూడా ఉంది.

Also Read: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?

Redmi Xiaomi 55 ఇంచుల F సిరీస్ UHD 4K స్మార్ట్ LED ఫైర్ టీవీ

Redmi Xiaomi 55 ఇంచుల F సిరీస్ UHD 4K స్మార్ట్ LED ఫైర్ టీవీ అమెజాన్‌లో కూడా భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఈ టీవీపై కంపెనీ 40% వరకు తగ్గింపును అందిస్తోంది. దీని అసలు ధర రూ. 54,999గా ఉంది. కానీ ఇప్పుడు దీన్ని కేవలం రూ. 32,999కే కొనుగోలు చేయవచ్చు. ICICI క్రెడిట్ కార్డ్‌తో ఈ టీవీపై రూ.2000 వరకు తగ్గింపు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్‌తో రూ.1250 వరకు తగ్గింపు కూడా లభిస్తుంది.

Also Read: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?

LG 55 ఇంచుల 4K అల్ట్రా HD స్మార్ట్ LED టీవీ

అమెజాన్ LG 55 ఇంచుల 4K అల్ట్రా HD స్మార్ట్ LED టీవీపై 42% వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ.71,990గా ఉంది. కానీ ఇప్పుడు ఈ టీవీని కేవలం రూ. 41,990 కి సొంతం చేసుకోవచ్చు. HDFC క్రెడిట్ కార్డ్ EMI, ICICI క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్లతో రూ.1500 వరకు తగ్గింపు పొందవచ్చు.

(tech-news | tv offers | smart-tv-offer | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: ఎక్కడికీ వెళ్లొద్దు..అమెరికాలో టెకీలకు కంపెనీలు వార్నింగ్

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Apr 04, 2025 08:10 IST

    ఎక్కడికీ వెళ్లొద్దు..అమెరికాలో టెకీలకు కంపెనీలు వార్నింగ్

    ట్రంప్ వచ్చిన తర్వాత అంతా తారుమారు అయిపోతున్నాయి. ఇమ్మిగ్రేషన్, వీసా పాలసీలు మారిపోయాయి.  ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం పట్టుకుంది. దీంతో అమెరికాలో ఉన్న పెద్ద కంపెనీలు అన్నీ హెచ్ 1 బీ మీద చేస్తున్న ఉద్యోగులను ప్రయాణాలు చేయొద్దని చెబుతున్నాయి. 

    H1B Visa
    H1B Visa

     



  • Apr 04, 2025 08:08 IST

    హెల్త్‌ సూపర్‌వైజర్‌ హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్.. సుపారీ ఇచ్చి మరీ భార్య దారుణంగా!

    మహబూబాబాద్ హెల్త్ సూపర్ వైజర్ పార్థసారథి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. భార్య స్వప్నేప్రియుడికి రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. వెంటనే పోలీసులు స్వప్న, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

    Mahabubabad Supervisor Parthasarathy Case Update🔴LIVE : లవర్‌తో 5 లక్షల సుపారీ ఇచ్చి | Wife Swapna



  • Apr 04, 2025 08:08 IST

    ప్రముఖ నటుడు కన్నుమూత

    బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారంతో ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఎన్నో వందల సినిమాల్లో నటించారు.

    Veteran Actor Manoj Kumar Passes Away At 87
    Veteran Actor Manoj Kumar Passes Away At 87 Photograph: (Veteran Actor Manoj Kumar Passes Away At 87)

     



  • Apr 04, 2025 08:07 IST

    ఆమెకు మనసిచ్చేసిన చాహల్.. ఒక్క లైక్‌తో దొరికేసాడుగా!

    టీమిండియా క్రికెటర్ చాహల్-మహ్‌వశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల మహ్‌వశ్ సోషల్ మీడియాలో ‘హస్బెండ్’ పోస్టు పెట్టింది. అందులో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో తెలిపింది. ఆ వీడియోకు చాహల్ లైక్ కొట్టడంతో వీరిద్దరి రిలేషన్ వార్తలకు మరింత బలం చూకూరినట్లైంది.

    Yuzvendra Chahal - RJ Mahvash
    Yuzvendra Chahal - RJ Mahvash Photograph: (Yuzvendra Chahal - RJ Mahvash)

     



  • Apr 04, 2025 08:07 IST

    ప్రయాణిస్తున్న రైలు వాష్‌రూమ్‌లో వేధింపులు.. వీడియోలు రికార్డింగ్

    ఒడిశా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రక్సెల్ ఎక్స్‌ప్రెస్‌లో 12 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. అర్థరాత్రి 2 గంటల సమయంలో వాష్ రూమ్‌కి వెళ్లడంతో లైంగికంగా వేధించి వీడియో రికార్డింగ్ చేశాడు. వెంటనే తల్లిదండ్రులు 139కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు.



  • Apr 04, 2025 08:06 IST

    హైకోర్ట్ లో ఆర్జీవీకి ఊరట..తొందరపాటు చర్యలు వద్దు

    సినీ దర్శకుడు రాంగోపాల వర్శకు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో ఊరట దక్కింది. విచారణకు రావాలని సీఐడీ అధికారులు ఆర్జీవీకి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో...విచారణలో వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.

    RGV



  • Apr 04, 2025 08:06 IST

    మరో నెల రోజులపాటు ముంబైలోనే కొడాలి నాని.. టెన్షన్‌లో అభిమానులు!

    కొడాలి నానికి ఇటీవలే బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యావేక్షణలో ఉన్నారని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు తెలిపారు. నాని మరో నెల రోజులపాటు ముంబైలోనే ఉంటారని అన్నారు.

    kodali nani..
    kodali nani..

     



  • Apr 04, 2025 08:05 IST

    వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం

    రెండు రోజులుగా విపరీతమైన చర్చ జరుగుతున్న వక్ఫ్  సవరణ బిల్లుకు రాజ్యసభ కూడా పచ్చజెండా ఊపేసింది. రాజ్యసభలో కూడా అర్ధరాత్రి వరకూ దీనిపై చర్చ జరిగింది. ఈ బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది ఓటేశారు. 

    Rajya Sabha: రాజ్యసభ ఉప ఎన్నికల్లో 12 స్థానాల్లో ఎన్డీయే ఏకగ్రీవం



  • Apr 04, 2025 08:04 IST

    ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

    ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

    Rains



Advertisment
Advertisment
Advertisment