New Smartphone: రూ.5,999లకే కొత్త Ai+ స్మార్ట్‌ఫోన్.. కొద్ది రోజులు మాత్రమే ఛాన్స్..!

ఓ కంపెనీ తన కొత్త మొబైల్ Ai+ pulse 2 ను విడుదల చేసింది. కంపెనీ ఈ ఫోన్‌ను బడ్జెట్ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా రోజువారీ పనుల కోసం సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.

New Update
Ai+ pulse 2 Price  (1)

స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. దీంతో కొత్త కొత్త కంపెనీలు తమ ఫోన్లను వినియోగదారులకు పరిచయం చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. అందులోనూ ఇప్పుడంతా ఏఐ మాయాజాలం అయిపోవడంతో కంపెనీలు తమ ఫోన్లలో అత్యాధునిక ఫీచర్లు, టెక్నాలజీ అందించి అట్రాక్ చేస్తున్నాయి. ఇక ఈ నెలలో (మార్చి,2026) పలు స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌కు సిద్ధంగా ఉండగా.. తాజాగా ఓ కంపెనీ తన కొత్త మొబైల్ Ai+ pulse 2 ను విడుదల చేసింది. అయితే కంపెనీ బ్రాండ్ అనేది ఇంకా వెల్లడి కాలేదు. 

కంపెనీ ఈ ఫోన్‌ను బడ్జెట్ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా రోజువారీ పనుల కోసం సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. Ai+ pulse 2 ఫోన్ 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో Unisoc T7250 చిప్‌సెట్ అందించారు. ఇది 4GB, 6GB RAM ఆప్షన్‌తో 64GB, 128GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇప్పుడు దీని ధర, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.  

Ai+ pulse 2 Price 

Ai+ pulse 2 తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చింది. దీని 4GB+64GB వేరియంట్ ధర రూ.5,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే 6GB+128GB వేరియంట్ ధర రూ.7,999గా కంపెనీ నిర్ణయించింది. మార్చి 11న Ai+ pulse 2 సేల్ జరగనుంది. కాబట్టి ఈ ధరలు సేల్ రోజు మొదటి 24 గంటలు మాత్రమే ఉండనున్నాయి. కాగా కంపెనీ ఇంకా నాన్-సేల్ ధరను వెల్లడించలేదు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, షాప్సీ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 

Ai+ pulse 2 Specifications

Ai+ Pulse 2 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 450 nits బ్రైట్‌నెస్‌తో 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 12nm ప్రాసెస్‌పై నిర్మించిన Unisoc T7250 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. దీంతో పాటు 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది కొన్ని AI ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. 

Ai+ pulse 2 ఫోన్ భారీ 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది Android 16-ఆధారిత NxtQuantum OS కస్టమ్ స్కిన్‌పై నడుస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌కు IP64 రేటింగ్‌ను కూడా అందించింది. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీకి మద్దతిస్తుంది. 

Advertisment
తాజా కథనాలు