/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-05T142947.206.jpg)
Anand Mahindra: తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా టెక్ మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహింద్ర బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్ పేట్‌లో రేవంత్ సర్కార్ స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వర్సిటీగా ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రాను నియామకం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ స్థలాన్ని ఆనంద్ మహీంద్రా పరిశీలించనున్నట్లు సమాచారం. ఇక ఈ వర్సిటీ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. 17 కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
Also Read: అర్హత ఉన్నా రుణమాఫీ కాలేదా?: అయితే, ఈ నంబర్ కు వివరాలు వాట్సాప్ చేయండి!
ఇదిలాఉండగా ఇటీవలే హైదారాబాద్‌లో ఉన్న మహీంద్ర యూనివర్సిటీలో స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వర్సిటీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. కానీ రేవంత్ కేబినేట్ విస్తరణ పనుల్లో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. అయినప్పటికీ సీఎం రేవంత్ ఆరోజు సాయంత్రం తన నివాసంలో ఆనంద్ మహీంద్రాను కలుసుకున్నారు. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
The Chief Minister of Telangana, Revanth Reddy garu, who was meant to be the Chief Guest at the convocation of @MahindraUni yesterday had to miss it due to the extension of the Assembly.
But he was very gracious and spared the time to meet with me at his residence later in the… pic.twitter.com/HOWCZV17gk
— anand mahindra (@anandmahindra) August 3, 2024