విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి.. అడ్డొచ్చిన తండ్రి, సోదరుడిపై దారుణం

ప్రకాశం జిల్లా అయినముక్కలలో కె.శ్రీనివాసప్రసాద్‌ అనే ఉపాధ్యాయుడు 9వ తరగతి విద్యార్థినిని తన ఇంటికి పిలిపించుకుని లైంగిక దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. ఈ అన్యాయంపై ప్రశ్నించిన ఆమె తండ్రి, సోదరుడిపై దాచి చేయగా నిందుతుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి.. అడ్డొచ్చిన తండ్రి, సోదరుడిపై దారుణం

Teacher Harassment : ఈ మధ్యకాలంలో పాఠశాలలో పిల్లలకు రక్షణగా ఉండాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా పసిపిల్లపై లైంగిక వాంఛ తీర్చుకునేందుకు క్రూగ మృగాలుగా(Harassment) వ్యవహరిస్తున్నారు. టాయిటెల్ వెళ్లిన ఆడిపిల్లలపై ఆగయిత్యాలకు పాల్పడుతున్నారు. బాత్ రూమ్ లో మలమూత్రం చేస్తున్న అమ్మాయిలను దొంగచాటున ఫోన్ కెమెరాల్లో బంధించి పైచాచిక ఆనందం పొందుతున్నారు. ఇలాంటి మరో దారుణమైన ఘటనే ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ టీచర్ అడ్డొచ్చిన అమ్మాయి సోదురుడిపైన దాడిచేయడం కలకలం రేపింది.

ఈ మేరకు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం అయినముక్కలలో శుక్రవారం ఈ ఘటన జరిగగా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దదోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కె.శ్రీనివాసప్రసాద్‌ శుక్రవారం పాఠశాలకు ఒకపూట సెలవు పెట్టారు. అయితే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి తన ఇంటికి పిలిచారు. ఆమె తరగతి గదిలో పుస్తకాలు పెట్టి వెళ్లిన విషయం గమనించిన క్లాస్‌ టీచర్‌.. విద్యార్థిని తండ్రికి ఫోన్‌ చేసి అమ్మాయి ఇంటికి వచ్చిందా అని అడిగారు. అయితే ఇంటికి రాలేదని తెలుసుకున్న తండ్రి కంగారుపడ్డాడు. తన అన్న కుమారుడితో కలిసి పాఠశాలకు వెళ్లారు.

Also read :ECIL : ఈసీఐఎల్ లో 363 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు!

అయితే ఈ క్రమంలోనే ఇరుగుపొరుగు, తోటి విద్యార్థులను వివరాలు అడిగిన ఎవరూ తెలీదనే చెప్పారు. దీంతో గణిత ఉపాధ్యాయుడు సెలవు పెట్టిన విషయం తెలిసుకున్నారు. వెంటనే ఆయన ఇంటికి వెళ్లారు. ఉపాధ్యాయుడు ఇంట్లో తలుపులు వేసుకుని ఉండటంతో తలుపులు కొట్టారు. మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిందా అని ప్రశ్నిస్తే రాలేదని చెప్పాడు. అనుమానంతో లోపల విద్యార్థిని ఉండటం చూసి ఆయనతో వారు గొడవకు దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు కత్తితో విద్యార్థిని సోదరుడిపై దాడిచేసి గాయపరిచాడు. తండ్రిపై కూడా దాడిచేసేందుకు వెనకాడలేదు. వెంటనే విద్యార్థిని తండ్రి స్థానికుల సాయంతో ఫిర్యాదు చేయగా.. వెంటనే ఎస్సై అంకమ్మరావు సంఘటన స్థాలానికి చేరకుని ఉపాధ్యాయడు శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు