Andhra Pradesh : అనపర్తిలో పొలిటికల్ వార్.. టెన్షన్‌.. టెన్షన్‌

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వాతావరణం టెన్షన్ టెన్షన్ గామరిపోయింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పోలీసులు అడ్డగించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అవినీతిని బయటపెడతానంటూ రామకృష్ణారెడ్డి బయలుదేరారు.

New Update
Andhra Pradesh : అనపర్తిలో పొలిటికల్ వార్.. టెన్షన్‌.. టెన్షన్‌

TDP, YCP Political War : అనపర్తి(Anaparthy) లో లోకల్ పాలిటిక్స్(Local Politics) కాకపుట్టిస్తున్నాయి. వైసీపీ(YCP), టీడీపీ(TDP) నేతలు ఒకరికొకరు ఛాలెంజ్‌లు విసురుకుంటూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈనేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం దగ్గర బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే సూర్య నారాయణ రెడ్డి రూ.500 కోట్ల అవినీతిని నిరూపిస్తానని.. ఇవాళ 11 గంటలకు ఎమ్మెల్యే ఇంటికి వెళ్తానని రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే దంపతుల అవినీతిపై ఆధారాలున్నాయని అన్నారు. 175 మంది ఎమ్మెల్యేల్లో తాను ఒక్కడినే అవినీతి చేయలేదంటున్న సూర్యనారాయణరెడ్డి.. చర్చకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. దీనికి మగతనం ఉంటే నేను ఉన్నప్పుడే రావాలని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి బదులు చెప్పారు. ఎవరూ లేనప్పుడు వచ్చి కుక్కలా మొరగడం కాదని... దమ్మంటే రమ్మని... వస్తే ఒక్క పార్ట్ కూడా లేకుండా చేస్తానని సూర్యనారాయణ రెడ్డి రెచ్చిపోయారు.

తగ్గేదేలే అంటున్న నేతలు...

టీడీపీ(TDP), వైసీపీ(YCP) నేతలు ఇద్దరూ ఎక్కడా తగ్గడం లేదు. ఒకరిని ఒకరు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ సవాళ్ళు విసురుకుంటున్నారు. మార్చి 1న రా అని సూర్యనారాయణ రెడ్డి సవాల్ విసిరేతి... మీ ఇంటికే నేరుగా వస్తానంటూ రామకృష్ణారెడ్డి బదులు చెబుతున్నారు. దీంతో దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని ఎమ్మెల్యే రెచ్చిపోయారు. దానికి నీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి అంటూ రామకృష్నారెడ్డి పిలుపునిచ్చారు. నాలుగు రోజుల క్రితం రామకృష్ణారెడ్డి.. ఎమ్మెల్యే అవినీతి ఇదిగో అంటూ కరపత్రాలు పంచడంతో ఈ గొడవ స్టార్ట్ అయింది.

ఎమ్మెల్యే ఇంటికి బయలుదేరిన రామకృష్ణారెడ్డి..

ఈరోజు ఉదయం రామవరం నుంచి అనపర్తిలోని ఎమ్మెల్యే ఇంటికి రామకృష్ణారెడ్డి బయల్దేరారు. అయితే పోలీసులు రామకృష్ణారెడ్డిని రామవరంలోనే ఆపేశారు.  రామకృష్ణారెడ్డి కారు ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. ఇంకోవైపు టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.  ఆయన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు-టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని.. తనతో మాట్లాడతామని వచ్చి నిర్బంధించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.

Also Read : Telangana : బాబోయ్ ఘాటు..కొన్ని రోజులు కొనడం మానేయడమే బెటరేమో.

Advertisment
Advertisment
తాజా కథనాలు