Chandrababu vs BJP: చంద్రబాబుపై కేసుల వెనుక కేంద్ర పెద్దలు? ఇప్పటివరకు నోరు విప్పని కమలనాథులు! చంద్రబాబుపై కేసుల వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఇదే సమయంలో కేంద్రంలోని పెద్దలు జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వడం.. ఏపీ రాష్ట్ర బీజేపీ కూడా మౌనం వహిస్తుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత మరిది అరెస్ట్ అయినా కనీసం ఏపీ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎందుకు స్పందించలేదని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. By Trinath 13 Sep 2023 in Latest News In Telugu రాజకీయాలు New Update షేర్ చేయండి Chandrababu Arrest Row: కేంద్రంలోని బీజేపీ(BJP) పెద్దల గ్రీన్ సిగ్నల్‌తోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందానన్న అనుమానం తెలుగు ప్రజల్లో నెలకొంది. బీజేపీ డైరెక్షన్‌తోనే ప్రస్తుతం పరిణామాలు జరుగుతున్నాయన్న ప్రచారం తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. చంద్రబాబు(Chandrababu) ఎపిసోడ్‌లో ఇప్పటివరకు బీజేపీ నేతలు ఎందుకు నోరు విప్పలేదు? సొంత మరిది అరెస్ట్ అయినా కనీసం ఏపీ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి (Purandeswari) ఎందుకు స్పందించలేదు? ప్రస్తుతం అందరి నోటా ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌ని ఇప్పటికే INDIA కూటమిలోని భాగస్వామ్య పార్టీలు అరెస్ట్‌ను ఖండించాయి. అటు ఎన్డీఏ(NDA) నుంచి ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ లేదు. కేంద్రం ఆడిస్తోన్న డ్రామానా? చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ వ్యూహం ఉందన్న ప్రచారం ఏపీలో విస్తృతంగా జరుగుతోంది. అటు కేంద్రం రియాక్ట్ అవ్వకపోగా.. ఇటు ఏపీ బీజేపీ కూడా మౌనం వహిస్తోంది. పురందేశ్వరి కనీసం మాట్లాడడం లేదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. పురంధేశ్వరి నోటిని బీజేపీ పెద్దలు కట్టేశారంటూ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు విషయంలో సైలెంట్‌గా ఉంటున్నారు బీజేపీ నేతలు. ఇక కేంద్రం డైరెక్షన్‌లోనే అంతా జరుగుతోందంటున్న టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అనుమానాన్ని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యక్తం చేశారు. Also Read: నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు.. లోకేష్‌కి ఫోన్ చేసిన రజనీకాంత్ ముందు అలా.. తర్వాత మరోలా: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా చేపట్టిన బంద్‌కు మద్దతు ప్రకటిస్తూ ముందుగా పురంధేశ్వరి లేఖ రిలీజ్ చేశారు. ఆ తర్వాత అది ఫేక్ లెటర్ అంటూ ఖండించారు. బీజేపీ అగ్రనేతల వార్నింగ్‌తోనే పురంధేశ్వరి వెనక్కి తగ్గారన్న టాక్ వినిపిస్తోంది. అటు టీడీపీ నేతల వ్యాఖ్యలకు తాజా పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. జగన్‌కు (Jagan) కేంద్ర పెద్దల అపాయింట్‌మెంట్ ఇస్తుండడం.. చంద్రబాబు విషయం మాట్లాడటానికేనంటూ ప్రచారం జరుగుతోంది. అటు జగన్ అడిగినప్పుడల్లా కేంద్రంలోని పెద్దలు అపాయింట్‌మెంట్ ఇస్తుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటి చేస్తాయని ప్రచారం జరిగింది. చంద్రబాబు కేంద్రంలోని పెద్దలతో పలుమార్లు భేటీ అయ్యారు కూడా. మరోవైపు పార్లమెంట్‌లో ఎన్డీఏ బిల్లులకు జగన్ సర్కార్ మద్దతిస్తూ వచ్చింది. మరో వారం రోజుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతుండగా.. కేంద్రం వన్ నేషన్.. వన్ పోల్, యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి బిల్లులను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. ఇదే సమయంలో ఈ పరిణామాలు జరుగుతుండడంపై ప్రజలు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. ALSO READ: వాట్‌నెక్ట్స్..? సుప్రీం కోర్టుకు చంద్రబాబు? అక్కడే తేల్చుకునే ఛాన్స్! #pm-modi #chandrababu #chandrababu-arrest #amit-shah #tdp-vs-bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి