#MothaMogiddham: నేడు 7 గంటలకు టీడీపీ 'మోత మోగిద్దాం'.. పవన్ కూడా మోగిస్తారా?

చంద్రబాబుకు (Chandrababu) మద్దతుగా ఈ రోజు రాత్రి 7 గంటల ఉంచి 7:05 వరకు శబ్ధం చేస్తూ తెలపాలని నారా లోకేష్‌ (Nara Lokesh) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారా? లేదా అన్న అశంపై రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

New Update
#MothaMogiddham: నేడు 7 గంటలకు టీడీపీ 'మోత మోగిద్దాం'.. పవన్ కూడా మోగిస్తారా?

చంద్రబాబుకు (Chandrababu) మద్దతుగా ఈ రోజు రాత్రి 7 గంటల ఉంచి 7:05 వరకు శబ్ధం చేస్తూ తెలపాలని నారా లోకేష్‌ (Nara Lokesh) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఎక్కడ ఉన్నా కూడా బయటకు వచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టాలని కోరారు లోకేష్. లేదా విజిల్ వేయాలన్నారు. రోడ్డు మీద వాహనంతో ఉన్న వారు హారన్ కొట్టాలన్నారు. ఎవరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా చంద్రబాబకు ప్రజల్లో ఉన్న మద్దతును దేశ వ్యాప్తంగా చాటాలని టీడీపీ భావిస్తోంది. పలు ముఖ్య కూడళ్లు, పట్టణాల్లో సామూహికంగా ఈ కార్యక్రమ నిర్వహణకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చంద్రబాబును కలిసి తన మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని కూడా ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పవన్ కల్యాణ్‌ కూడా నారా లోకేష్ పిలుపుకు స్పందించి చంద్రబాబుకు మద్దతుగా శబ్ధం చేస్తారా? లేదా? అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. పవన్ శబ్ధం చేస్తే ఓ రకమైన చర్చ, చేయకపోతే మరో రకమైన చర్చ జరిగే అవకాశం ఉంది.


ఇదిలా ఉంటే.. చంద్రబాబు అరెస్టుపై నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తోంది టీడీపీ. ఇందులో భాగంగా అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా భువనేశ్వరి ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు టీడీపీ నేతలు నందమూరి బాలకృష్ణ, అచ్చెంనాయుడు ప్రకటించారు. అదే రోజు సాయంత్రం ప్రతీ ఇంట్లో లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులతో అందరూ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Chandrababu: చంద్రబాబు కు టాలీవుడ్ మద్దతు లభించనుందా..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు