Andhra Pradesh: జైలు నుంచి బండారు విడుదల.. టీడీపీ నేతల రియాక్షన్ మామూలుగా లేదుగా.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి(Bandaru Satyanarayana)కి బెయిల్ దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు ఆ పార్టీ నేతలు. ఇదే సమయంలో వైసీపీ(YCP) ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు సత్యనారాయణమూర్తిపై ప్రభుత్వం పోలీసులతో హైడ్రామా నడిపిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. By Shiva.K 03 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Andhra Pradesh: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి(Bandaru Satyanarayana)కి బెయిల్ దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు ఆ పార్టీ నేతలు. ఇదే సమయంలో వైసీపీ(YCP) ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు సత్యనారాయణమూర్తిపై ప్రభుత్వం పోలీసులతో హైడ్రామా నడిపిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. కోర్టు మొట్టికాయలు పడతాయని తెలిసినా కేసులు పెట్టి వేధిస్తున్నారని నిప్పులు చెరిగారు. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి దీక్షలు చేపట్టిందని, దీక్షలకు మద్దతు లభిస్తుందని బండారుపై కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు. నోటీసులు ఇచ్చి విచారించాల్సిన కేసులో అరెస్టు చేసి తెచ్చారని మండిపడ్డారు. టిడిపి వారిపై కేసులు పోలీసులు సొంత వ్యవహారంలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారాయన. ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏమిటి ఆలోచించండి అంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చారు. పోలీసులతో కేసులు పెట్టే తప్పుడు సంస్కృతి ఏంటని ప్రశ్నించారు. వైసీపీ సోషల్ మీడియా వింగ్ కోట్ల రూపాయలు ఖర్చు చేసి టీడీపీ మహిళా నేతలపై నిత్యం బురద జల్లుతోందని, వారిపై మాత్రం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేని ఆగ్రహం వ్యక్తం చేశారు నక్కా ఆనందబాబు. జగన్ ఆలోచన విధానం అందరినీ ఇబ్బంది పెడుతోందని టీడీపీ నేత టీడీపి నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు. పోలీసులను వైసీపీ కార్యకర్తలు మాదిరిగా వాడుతున్నారని విమర్శించారు. భవిష్యత్తులో పోలీసులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వ్యవస్థలను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వం, పోలీసుల తీరు ఉందన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కటానికి అధికారం ఉందని జగన్ భావిస్తున్నారని, టిడిపి నేతలపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. హైకోర్టులో లంచ్ మోషన్ వేస్తే పోలీసులు నోటీసులు ఇవ్వలేదని అసత్యాలు చెప్పారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. స్పష్టంగా వారు సంతకాలు చేసిన నోటీసులు హైకోర్టుకు ఇచ్చామని తెలిపారు. బెయిల్ వచ్చే కేసుల్లో అరెస్టు చేయొద్దని కోర్టులు చెబుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కటానికి కేసులు పెడుతున్నారని, సోషల్ మీడియాలో వీడియో చూసి ఎస్సైతో సుమోటోగా కేసు పెట్టించటం ఏంటన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు ఆలపాటి. బెయిల్‌పై విడుదలైన తరువాత బండారు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగం పట్ల నాకు గౌరవం ఉందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానంలో న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది అని విశ్వాసం వ్యక్తం చేశారు. న్యాయదేవతకు నమస్సులు తెలిపారాయన. కష్ట సమయంలో తన కోసం వేచి ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుకు కూడా త్వరగా బెయిల్ రావాలని కోరుకుంటున్నానని అన్నారు. అరెస్టు సమయం నుంచి లోకేష్ తనకు అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు బండారు సత్యనారాయణ. Also Read: సీఈసీ బృందంతో పొలిటికల్ లీడర్స్ భేటీ.. వారం పది రోజుల్లో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్! Telangana Politics: ఆ ముగ్గురు మళ్లీ మిస్.. కాంగ్రెస్‌లోకి జంపేనా? #andhra-pradesh #andhra-pradesh-news #tdp-leaders #ap-government #bandaru-satya-narayana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి