/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet1-1-jpg.webp)
Nara Lokesh Yuvagalam Padayatra starts from Chandrababu House: తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర 188వ రోజుకు చేరుకుంది. నేటి నుంచి వారం రోజుల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో (Krishna District) యువగళం పాదయాత్ర జరగనుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద పాదయాత్రకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉండవల్లి సీతానగరం వద్ద పాదయాత్ర 2,500 కిలో మీటర్లు పూర్తైన సందర్భంగా శిలా ఫలకం ఆవిష్కరించనున్నారు.
కాగా ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రకాశం బ్యారేజ్ మీదగా లోకేష్ పాదయాత్ర విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చేరుకోనుంది. విజయవాడలో మొత్తం 24 డివిజన్ల మీదుగా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఆర్యవైశ్యులు, కాళేశ్వరరావు మార్కెట్ హమాలీ అసోసియేషన్ ప్రతినిధులు, ఎలక్ట్రికల్ వర్కర్స్ తో సమావేశం జరగనుంది. అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోకి ఆటో వర్కర్స్ , బుక్ పబ్లిషర్స్ , ముస్లిం , బ్రాహ్మణ సామాజిక వర్గాలతో సమావేశం కానున్నారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో స్థానికులతో మాటామంతి ... ఆపై ఆర్‌ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఏ కన్వెన్షన్ సెంటర్ వద్ద రాత్రికి నారా లోకేష్ బస చేయనున్నారు.
బెజవాడలో టెన్షన్:
మరోవైపు నారా లోకేష్ యువగళం పాదయాత్ర కోసం విజయవాడలో టీడీపీ నాయకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే లోకేష్ పాదయాత్రతో మరోసారి బెజవాడలో టీడీపీ నేతల మధ్య తగాదాలు మరోసారి బయట పడ్డాయి. లోకేష్ యువగళం పాదయాత్రకు స్వాగతం పలుకుతూ టీడీపీ నాయకులు కరిముల్లా, పడాల వాసులు రోడ్డున పడి ఒకరినొకరు కొట్టుకున్నారు. అలాగే కేశినేని బ్రదర్స్ మధ్య వార్.. ఇలా బెజవాడ రాజకీయం మరోసారి రచ్చెక్కింది.
విజయవాడలో లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లు, పర్యవేక్షణ బాధ్యతను అధిష్టానం కేశినేని చిన్నికి అప్పగించింది. అధిష్టానం నిర్ణయంతో ఎంపీ కేసిని నాని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో లోకేష్ పాదయాత్రకు కేశినేని నాని హాజరు కారని టాక్ వినిపిస్తుంది. కానీ లోకేష్ పాదయాత్రకు అందరినీ ఆహ్వానించారని కేశినేని చిన్ని వర్గం చెబుతున్నా.. కేశినేని నాని వర్గం మాత్రం మాకు ఆహ్వానం అందలేదని అంటున్నారు. దీంతో లోకేష్ పాదయాత్రపై టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఎలాంటి విభేదాలు లేవు:
మరికొందరు నేతలు మాత్రం.. లోకేష్ కు పాదయాత్రతో వైసీపీ నేతలకు వణుకు పుడుతుందన్నారు. రాష్ట్రంలో టీడీపీకి నాయకుల మధ్య ఎటువంటి వర్గ విభేదాలు, గ్రూపు రాజకీయాలు లేవని అంటున్నారు. లోకేష్ చేస్తున్న యాత్రలో నాయకులంతా కలిసి సభను విజయవంతం చేస్తామన్నారు. అధికార పార్టీ నేతల మాయ మాటలు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని.. విజయవాడలో సీట్లు టీడీపీ గెలుచుకోవడం ఖాయమని టీడీపీ శ్రేణులు అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును నాయకత్వంపై ప్రజలంతా ఎంతో నమ్మకంతో, ఆశతో పాలన కోసం చూస్తున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు.
Also Read: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్ లోకి రూ.15 వేలు