ఆంధ్రప్రదేశ్ Chandrababu : వైసీపీ గెలిచే పరిస్థితి లేదు.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు భరోసా AP: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మాడి మసై పోతుందని అన్నారు చంద్రబాబు. ఎండల బాదుడు కంటే వైసీపీ బాదుడే ఎక్కువ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ గెలిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అహంకార ప్రభుత్వం కూలిపోవాలని అన్నారు. By V.J Reddy 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: టీడీపీలో చేరిన వైసీపీ నేతలు ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి షాక్ తగిలింది. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి బాబు ఆహ్వానించారు. By V.J Reddy 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Chief Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం అని అన్నారు. వాలంటీర్లను రాజీనామా చేయాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారు రాజీనామా చేయాల్సిన పని లేదని అన్నారు. By V.J Reddy 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: చంద్రబాబుకు ఈసీ షాక్ ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లఘించారని నోటీసులు జారీ చేసింది. మార్చి 31న ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది. 48 గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని కోరింది. By V.J Reddy 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: ఈ నియోజకవర్గాల్లో నేడు చంద్రబాబు పర్యటన టీడీపీ అధినేత చంద్రబాబు నేడు అనంతపురం జిల్లాలో పర్యటన చేయనున్నారు. మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాప్తాడు, శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. By Jyoshna Sappogula 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Chief Chandrababu: రాఖీ పౌర్ణమి వేడుకల్లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు తెలుగు దేశం కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాశక్తి - రక్షా బంధన్ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబుకు పీతల సుజాత, వంగలపూడి అనిత, తెలుగు మహిళలు, బ్రహ్మ కుమారీలు రాఖీలు కట్టారు. అనంతరం మహిళలకు టీడీపీ హయాంలో చేపట్టిన కార్యక్రమాల గురించి చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అక్కలకు, చెల్లెళ్లకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పారు. మహిళలకు మూడు గ్యాస్ సిలెండర్లు కాకుండా అవసరమైతే మరో సిలెండర్ ఉచితంగా ఇస్తామన్నారు. మహిళలను శక్తి మంతులుగా చేయడమే టీడీపీ లక్ష్యమన్నారు. తెలుగు దేశం పార్టీ గెలుస్తుందని సంకల్పం చేసుకుని ప్రయత్నించండని పిలుపునిచ్చారు. By E. Chinni 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Yarlagadda Venkata Rao Sensational Comments: పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా: యార్లగడ్డ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఉదయం ఆయన నివాసంలో కలిశారు. ఇరువురూ కొద్దిసేపు చర్చలు జరిపారు. ఈ నెల 22న గన్నవరం సభలో యార్లగడ్డ వెంకట్రావు తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు. అనంతరం యార్లగడ్డ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డబ్బు సంపాదించాలని తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఆరేళ్లుగా వైసీపీకి సేవ చేశానని, మూడున్నర ఏళ్లుగా వైసీపీలో ఎన్నో చూశానన్నారు యార్లగడ్డ. By E. Chinni 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TDP Chief Chandrababu: ఒక్క రోజులోనే నలుగురు అన్నదాతలు సూసైడ్.. చంద్రబాబు ఆవేదన రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu). ఒక్క రోజే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు బలవన్మరణాలు పొందడంపై ఆందోళన చెందారు. ఈ సందర్భంగా ఆదివారం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ప్రాంతంలో పర్యటనకు వెళ్లినా రైతు కష్టాలు, రైతాంగ సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు బలవన్మరణాలు పొదడం ఆవేదన కలిగించిందన్నారు చంద్రబాబు. By E. Chinni 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Yarlagadda meets Chandrababu Naidu: చంద్రబాబును కలిసిన యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో గన్నవరం సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు కాసేపట్లో భేటీ కానున్నారు. దీంతో వీరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుతో భేటీ కోసం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు యార్లగడ్డ వెంకట్రావు. ఈ నెల 22వ తేదీన గన్నవరంలో యార్లగడ్డ పసుపు కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. By E. Chinni 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn