ఆంధ్రప్రదేశ్ TDP Chief Chandrababu: ఈసారి వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావు: చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావన్నారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన మహిళా ప్రగతి కోసం ప్రజా వేదిక కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈసారి వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ప్రతీ ఇంట్లో మహిళలే.. ఆర్థిక మంత్రి.. సూపర్ సిక్స్ లో భాగంగా మహా శక్తికి మొదటిగా ప్రాధాన్యత కల్పించామని తెలిపారు చంద్రబాబు. మా తల్లి పడిన కట్టెల పొయ్యి కష్టాన్ని చూసి తట్టుకోలేక ఆడ బిడ్డలను ఆదుకునే విధంగా దీపం పథకాన్ని ప్రారంభించానన్న ఆయన.. వైకుంఠపాళీ మాదిరిగా మారింది ప్రస్తుత పరిస్థితి.. నేను అభివృద్ధి చేస్తే.. వాటిని వీళ్ళు నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Chief Chandrababu: సర్పంచులతో చంద్రబాబు సమావేశం.. ఆవేదన వ్యక్తం చేసిన సర్పంచులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రాబాబు పర్యటన కొనసాగుతుంది. గురువారం చంద్రబాబు మండపేటలో పర్యటించారు. ఈ క్రమంలో స్థానిక సర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సర్పంచుల హక్కులను కాపాడుకునేందుకు పోరాటం చేయాలన్నారు. సీఎం జగన్ సర్పంచుల హక్కులను కాల రాస్తున్నారని ఫైర్ అయ్యారు. మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక సర్పంచుల ఆధ్వర్యంలోనే పంచాయతీల పనులు చేయిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ వ్యవస్థలను జగన్ నాశనం చేశారని విమర్శించారు. 25 వేల కిలోమీటర్లు రోడ్డు వేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని పేర్కొన్నారు చంద్రబాబు. By E. Chinni 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Minister Dharmana Prasada Rao: 14 ఏళ్లు సీఎం అయి ఉండి.. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశావా?: మంత్రి ధర్మాన ఫైర్ మేము చేయలేదు అంటున్నారు.. కనీసం మీరు ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? అని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు. శనివారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు.. ప్రాజెక్టుల గురించి ప్రశ్నించడం ఏంటి? అని నిలదీశారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించి తనకు అభిమానం ఉన్నట్లు, సాగునీటి ప్రాజెక్టులను.. వైసీపీ ప్రభుత్వం ఏదో విధ్వంసం చేసినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1996లో సీఎం అయి.. 14 ఏళ్లు ముఖ్యమంత్రి అయిన మీరు ఏంచేశారు?, కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పగలరా? అంటూ అడిగారు. వంశధార ప్రాజెక్టుపై ఏనాడైనా పట్టించుకున్నారా?, గతంలో విద్యుత్ చార్జీలు ఎందుకు తగ్గించలేదు.. ఉచిత విద్యుత్ దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Chief Chandrababu: కేసుల్లో చిక్కుకున్న బాధితులతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు.. విడుదల చేయిస్తానని భరోసా! అన్నమయ్య జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పోలీసులు కేసులు నమోదు చేసిన బాధిత కుటుంబాలతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు శుక్రవారం ఫోన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తాను, పార్టీ పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చు. తప్పుడు కేసులు కోర్టుల్లో నిలబడవని స్పష్టం చేశారు. కార్యకర్తల అక్రమ అరెస్టులు తనను ఎంతో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం ద్వారా అందరినీ విడుదల చేయిస్తానని చెప్పారు. సాధ్యమైనంత త్వరలోనే బయటకు తీసుకువస్తామని వెల్లడించారు. అక్రమ కేసులతో వందల కుటుంబాల క్షోభకు కారణం అయిన ప్రతి ఒక్కరు రానున్న రోజుల్లో మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. By E. Chinni 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ సర్కార్ నీరు గారుస్తోంది: చంద్రబాబు ఫైర్ టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై.. యుద్ధభేరి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 9వ రోజు ఉమ్మడి విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి రిజర్వాయర్ ను చంద్రబాబు సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులను నీరు గారుస్తోందని దుయ్యబట్టారు. సీఎం జగన్ వల్ల ఎన్నో నీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. అవే పూర్తి అయి ఉంటే.. ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఎంతో అద్భుతంగా ఉండేదన్నారు చంద్రబాబు. By E. Chinni 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నాపైనే హత్యాయత్నం చేసి.. నాపైనే కేసు పెడతారా: చంద్రబాబు ఫైర్ తనపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపైనే హత్యాయత్నం చేసి.. రివర్స్ లో తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. సైకో ముఖ్యమంత్రి ఆదేశాలతోనే అంగళ్లలో విధ్వంసం సృష్టించారన్నారు. అంగళ్లు ఘటనకు సంబంధించి వైసీపీ అరాచకాలతో పాటు పోలీసులు వ్యవహరించిన తీరును చంద్రబాబు తప్పుపట్టారు. By E. Chinni 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి వల్ల పోలవరం ప్రాజెక్ట్ కు చెప్పలేనంత నష్టం జరిగింది: చంద్రబాబు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిధిలోని కొత్తగా ఏ ఒక్క కట్టడం కూడా జగన్ రెడ్డి చేపట్టలేదని, ఇంకా 214 కట్టడాలు కట్టాల్సి ఉందని చెప్పారు. అలాగే 50 శాతం కనెక్టివిటీ పనులు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. పురుషోత్తం పట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ను పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు విశాఖ నగరానికి సుమారు 23 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని నిర్ణయిస్తే వైసీపీ ఆటకెక్కించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖుడి దగ్గర అధికారం ఉంటే, రాష్ట్రానికి ఎంత నష్టమో పోలవరం ఓ ఉదాహరణ.. By E. Chinni 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బాబు గ్రాఫిక్స్ చూపించారు తప్ప.. రాజధాని కట్టాలేదు: మంత్రి ఆదిమూలపు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు నంగనాచి కబుర్లన్నీ చెబుతున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టులు ప్రారంభించి పూర్తి చేసిన ఘనత దివంగత నేత వైఎస్సార్ ది మాత్రమేనని చెప్పారు. ప్రాజెక్టుల మీద చంద్రబాబు యుద్ధం ప్రకటిస్తానని చెప్పడం హాస్యాస్పదం అని మంత్రి సురేష్ అన్నారు. గ్రాఫిక్స్ చూపించడం తప్ప చంద్రబాబు రాజధాని కట్టారా? అని మంత్రి నిలదీశారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారని.. By E. Chinni 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సైకో టైమ్ అయిపోయింది.. నా ఉగ్రరూపం చూపిస్తా: చంద్రబాబు సైకో టైమ్ అయిపోయిందని.. వైసీపీ నేతలకు నా ఉగ్రరూపం చూపిస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఆదివారం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నెల్లూరుకు వచ్చారు చంద్రబాబు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సైకో ఓడిపోతాడని, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి.. జగన్ శనిలా దాపురించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో వరి విస్తీర్ణం తగ్గిపోయిందని.. By E. Chinni 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn