Nara Lokesh: స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ కు స్వల్ప ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వచ్చే నెల 4 వరకు లోకేష్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

New Update
Nara Lokesh: స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ కు స్వల్ప ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో (AP Skill Development Case) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వచ్చే అక్టోబర్ 4 వరకు లోకేష్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫైబర్ గ్రిడ్ లో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై విచారణను వచ్చే నెల 4 తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. ఇదిలా ఉంటే.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు ఈ రోజు డిస్పోజ్ చేసింది. విచారణకు సహకరించాలని లోకేష్‌ ను ఆదేశించింది. లోకేష్‌ కు 41 ఏ నోటీస్ ఇవ్వమని అధికారులను ఆదేశించింది. 41 ఏ నోటీసు ఇస్తామని కోర్టుకు ఏజీ శ్రీరామ్ తెలిపారు. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని ఏజీ శ్రీరామ్ వివరించారు.

దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని లోకేష్‌ కు చెప్పాలని అని కోరారు. ఈ నేపథ్యంలో విచారణకు సహకరించాలని లోకేష్ ను హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే.. ఏపీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీ బయలుదేరారు. విచారణకు రావాల్సిందిగా ఆయనకు 41A కింద నోటీసులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్, కేసుల విషయంలో ఆయన న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు.

అయితే.. లోకేష్ ఏపీకి రాగానే ఆయనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో లోకేష్ సీఐడీ విచారణకు ఏపీకి వస్తే ఆయనను అరెస్ట్ చేయడం ఖాయమన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఈ అంశంపై టీడీపీ నేతలు, నారా లోకేష్ కొద్ది సేపట్లో స్పందించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి:

Sajjala: లక్షమంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబు.. అలా కోట్లు కొట్టేశారు: సజ్జల

Advertisment
Advertisment
తాజా కథనాలు