Lokesh: 'అయ్యో జగన్'.. అంటూ సీఎం జగన్ పై లోకేష్ చురకలు సీఎం జగన్ పై చురకలు అంటించారు టీడీపీ నేత లోకేష్. ఆయన మాటలు మాత్రమే కోటలు దాటుతాయి, పనులు గడపదాటవు అంటూ విమర్శలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదని అన్నారు. By V.J Reddy 23 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Lokesh Satires CM Jagan : సీఎం జగన్(CM Jagan) పై మరోసారి విమర్శల దాడికి దిగారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh). జగన్ చెప్పేవన్నీ అబద్దాలే అని.. జగన్ ను చూస్తే జబర్దస్త్ లో బిల్డప్ బాబాయ్ గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ కు ప్రారంభించడమే తప్ప పూర్తి చేయడం తెలీదని ట్విట్టర్ వేదికగా చురకలు అంటించారు. ALSO READ: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ఆదేశాలు లోకేష్ ట్విట్టర్(X)లో.. 'అయ్యో...జగన్ కడప స్టీల్ ప్లాంట్ ఇంకా నిర్మించలేదా?!... జగన్మోహన్ రెడ్డి మాటలను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే మనకు జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తొస్తారు. ఆయన మాటలు మాత్రమే కోటలు దాటుతాయి, పనులు గడపదాటవు. సొంత ఇలాకా కడప జిల్లాలో మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేస్తానని చెప్పి తొలిసారి శిలాఫలకం వేసి నేటికి నాలుగేళ్లయింది. రూ.15వేలకోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి పాతికవేలమందికి ఉద్యోగాలిస్తానంటూ ఆనాడు కోతలు కోశాడు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్లాంట్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, కనీసం తుప్పలు తొలగించేందుకు సైతం నిధులు కేటాయించకపోవడంతో తొలుత ఒప్పందం చేసుకున్న లిబర్టీ స్టీల్స్ పరారైపోయింది. దీంతో జెఎస్ డబ్ల్యు అనే మరో కంపెనీని బతిమాలుకొని ఏడాది క్రితం మరోమారు శంకుస్థాపన చేశాడు. మరో మూడునెలల్లో పదవీకాలం పూర్తికావస్తున్నా కడప స్టీల్ ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదు. పులివెందులలో రోడ్ల నిర్మాణానికి బిల్లులు ఇవ్వకపోవడంతో కంకరపర్చి తారువేయకుండా కాంట్రాక్టర్ పరారయ్యాడు. ఇలాంటి దివాలాకోరు ముఖ్యమంత్రిని నమ్మి వేలకోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా?!' అంటూ రాసుకొచ్చారు. అయ్యో...జగన్ కడప స్టీల్ ప్లాంట్ ఇంకా నిర్మించలేదా?! జగన్మోహన్ రెడ్డి మాటలను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే మనకు జబర్దస్త్ బిల్డప్ బాబాయి గుర్తొస్తారు. ఆయన మాటలు మాత్రమే కోటలు దాటుతాయి, పనులు గడపదాటవు. సొంత ఇలాకా కడప జిల్లాలో మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేస్తానని చెప్పి… pic.twitter.com/jwdPp5WtHd — Lokesh Nara (@naralokesh) December 23, 2023 ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. వీరికే కొత్త రేషన్ కార్డులు! #ap-news #lokesh #cm-jagan #telugu-latest-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి