AP Politics:మరికాసేపట్లో టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం

టీడీపీ, జనసేన జేఏసీ సభ్యులు ఈరోజు సమావేశం కానున్నారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం జరగనుంది. మరికాసేపట్లో ఇది ప్రారంభం కానుంది.

New Update
AP Politics:మరికాసేపట్లో టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం

మరికాసేపట్లో టీడీపీ-జనసేన కానున్న జేఏసీ సభ్యుల సమావేశం మొదలుకానుంది. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం జరుగుతుందని తెలుస్తోంది. మేనిఫెస్టో ప్రకటన లోపు ఉమ్మడి కార్యాచరణ దిశగా ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లేందుకు ఓ కరపత్రo రూపకల్పన మీద ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటానికి 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకోనున్నారు టీడీపీ - జనసేన జేఏసీ సభ్యులు. వీటితో పాటూ ఓటర్ జాబితా అవకతవకలు పైనా ఉమ్మడి పోరుకు ప్రణాళిక చేయనున్నారు. నియోజకవర్గాల స్థాయిలో ఆత్మీయ సమావేశాల నిర్వహణపై జేఏసీ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

Also Read:హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

మరోవైపు ఓటరు లిస్టు అవకతవకలపై జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని టీడీపీ పీఏసీ సమావేశంలో ఇంతకు ముందే నిర్ణయించారు. జగన్ సర్కారు దోపిడీ, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉమ్మడి పోరాటాలకు కార్యాచరణ రూపకల్పన చేయాలని పీఏసీ భావించింది. ఇసుక, మద్యం, కరువు, ధరలు, ఛార్జీల పెంపు వంటి అంశాలపై ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రచించింది. నియోజకవర్గాల వారీగా టిడిపి-జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించేలా జేఏసీలో ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై నేటి సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read:దీపావళికి అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు.. ఈ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు