మంత్రి పెద్దిరెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం అంగుళ్లు పర్యటన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పెద్ది రెడ్డి దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని.. దాక్కోవడం కాదంటూ సవాల్ విసిరారు. పులివెందులకే వెళ్లాను.. ఇక్కడికి రాకూడదా అని నిలదీశారు. నేను కూడా చిత్తూరు జిల్లాలోనే పుట్టానని.. ఇలాంటి రాళ్ల దాడులకు భయపడనన్నారు చంద్రబాబు. వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలకు...

New Update
Peddireddy: చంద్రబాబు అందుకే అబద్ధాలు వల్లిస్తున్నాడు

ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం అంగుళ్లు పర్యటన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పెద్ది రెడ్డి దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని.. దాక్కోవడం కాదంటూ సవాల్ విసిరారు. పులివెందులకే వెళ్లాను.. ఇక్కడికి రాకూడదా అని నిలదీశారు. నేను కూడా చిత్తూరు జిల్లాలోనే పుట్టానని.. ఇలాంటి రాళ్ల దాడులకు భయపడనన్నారు చంద్రబాబు. వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలకు చికిత్స చేయించాలని టీడీపీ నేతలకు సూచించారు.

ఇక్కడ ఓ రావణాసురుడు ఉన్నాడని, ఆయనికి ట్యాగ్ ఎమ్మెల్యే అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించారు. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని, రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాంబులకే భయపడలేదు.. ఈ రాళ్ల దాడులకు భయపడతానా అని అన్నారు. తమ జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టనని చంద్రాబు నాయుడు హెచ్చరించారు.

వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి చేయడంతో ఎన్ఎస్ జీ బలగాలు చంద్రబాబుకు రక్షణగా నిలబడ్డాయి. వైసీపీ దాడులకు తెగబడిందంటూ.. టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు గాయాలు చూపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పతనం అంగళ్లు నుంచే ప్రారంభమైందని, పెద్దిరెడ్డి రోజులు లెక్కపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు.

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కురబల కోట మండలం, అంగళ్లులో యుద్ధ వాతావరణం నెలకొంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. చంద్రబాబు అంగళ్లుకు వచ్చే సమయానికి వైసీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి టీడీపీ కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలు టీడీపీ బ్యానర్లను తొలగించారు. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారు.

అలాగే పుంగనూరులో కూడా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం పుంగనూరులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో.. నియోజకవర్గ వైసీపీ నేతలు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నల్లజెండాలను, నల్ల బెలూన్లను ఎగురవేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాయలసీమకు మంజూరైన ఎయిమ్స్ వంటి కొన్ని భారీ ప్రాజెక్టులను సైతం అమరావతికి తరలించాడంటూ ధ్వజమెత్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు