CBN: ఒక్కో ఇంటికి రూ. 5 వేలు.. చంద్రబాబు కీలక నిర్ణయం టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలమైందని అన్నారు. వెంటనే బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. By V.J Reddy 09 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Chandra Babu : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు బాపట్ల(Bapatla) జిల్లా జమ్ములపాలెం ఎస్టీ కాలనీలో చంద్రబాబు పర్యటించారు. తుపాను వల్ల ఎస్టీ కాలనీ పూర్తిగా దెబ్బతింది. తుపాను వల్ల సర్వం కోల్పోయామని గిరిజనుల చంద్రబాబుతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేక 4 రోజులు చీకట్లోనే గడిపామని కాలనీ వాసులు చంద్రబాబుకు తెలిపారు. ALSO READ: రైతు బంధు ఎప్పుడు వేస్తారు?.. హరీష్ రావు ఫైర్! బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు చంద్రబాబు. అధికారంలోకి రాగానే కాలనీ సమస్యలు పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. యానాదుల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తనదని తెలిపారు. టీడీపీ(TDP) తరఫున ఒక్కో ఇంటికి రూ. 5 వేలు సాయం అందిస్తున్నాం అని చెప్పారు. తుఫాన్ బాధితులను ఏపీ ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని అన్నారు. జగన్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల పడుతున్న సమస్యలు కనిపించడం లేదా ? అని ప్రశ్నించారు. తుఫాన్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. పిఠాపురంలో లోకేష్ యువగళం.. టీడీపీ నేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం పిఠాపురంలో కొనసాగుతుంది. నేటితో ఈ యాత్ర 217వ రోజు చేరుకుంది. పిఠాపురంలోని తొండంగి మండలం కడారిపేటలోకి లోకేశ్ పాదయాత్ర ప్రవేశించింది. పెరుమాళ్లపురం వద్ద లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. గజమాలతో లోకేశ్‌కు స్వాగతించారు టీడీపీ- జనసేన కార్యకర్తలు. #tdp #chandrababu #cm-jagan #telugu-latest-news #bapatla-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి