Chandra Babu Naidu: అర్ధరాత్రి అమిత్ షా ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఎందుకంటే

టీడీపీ అధినేత చంద్రబాబు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ మీటింగ్‌లో టీడీపీ, బీజేపీల పొత్తులు, సీట్ల సర్దుబాటు, ఎన్డీఏలో చేరికపై చర్చలు జరిపారు. ఇవాళ పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు.

New Update
Chandra Babu Naidu: అర్ధరాత్రి అమిత్ షా ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఎందుకంటే

బుధవారం అర్ధరాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటికి.. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లారు. జేపీ నడ్డా, అమిత్‌ షాలతో ఆయన సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ మీటింగ్‌లో టీడీపీ, బీజేపీల పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. అలాగే ఎన్డీయేలో చేరికపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. చంద్రబాబు కంటే ముందుగా జేపీ నడ్డా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇవాల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. టీడీపీ-జనసేన నేతలు కేంద్ర పెద్దలను కలుస్తుండటంతో ఏపీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

పొత్తుల్లో భాగంగా.. 8 ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు తమకు కేటాయించాలని బీజేపీ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. 3 ఎంపీ సీట్లు, 5 నుంచి 10 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని టీడీపీ అగ్రనేతలు అంటున్నట్లు జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే.. అమిత్‌షా- చంద్రబాబు చర్చల్లో ఈ పొత్తులపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read: టీడీపీ, బీజేపీ పెళ్లి.. రెండు అడుగులు వేయడానికి అంగీకారం!

ప్రత్యక్షంగా బీజేపీ.. పరోక్షంగా కాంగ్రెస్

ఈనేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యక్షంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని.. పరోక్షంగా ఆయనతో కాంగ్రెస్ కూడా పొత్తు ఉంటుందని అన్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా ఆర్.అండ్.బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నిత్యం పొత్తుల కోసం తహతహలాడుతుంటారని.. అందులో భాగంగానే ఢిల్లీకి వెళ్లినట్లు పేర్కొన్నారు.

మళ్లీ మేమే 

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు భద్రత కల్పించలేదన్న వ్యాఖ్యల మీద ఆయన తీవ్రంగా స్పందించారు. ఆరోజు జగన్ పాదయాత్ర చేసిన రోజు.. జగన్‌తో పాటు మాలాంటి ఎంతో మంది నేతలకు భద్రత లేదన్నారు. జగన్‌ని అక్రమంగా 16 నెలలు జైలులో పెట్టిన రోజులు మర్చిపోయినట్టు ఉన్నారంటూ విమర్శించారు. భద్రత ఇక్కడ లేదంటే రఘువీరా, కేవీపీలు ఢిల్లీకి వెళ్లి అడగవచ్చని తెలిపారు. అలాగే రాయలసీమలో ఈసారి అన్ని స్థానాల్లో గెలుస్తామని.. మళ్లీ రెండోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాప్తాడులో ఈనెల 11న జరగాల్సిన సిద్ధం సభను 18వ తేదికి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.

Also Read: కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం: షర్మిల!

Advertisment
Advertisment
తాజా కథనాలు