TDP Chief Chandrababu: ఈసారి వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావు: చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావన్నారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన మహిళా ప్రగతి కోసం ప్రజా వేదిక కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈసారి వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ప్రతీ ఇంట్లో మహిళలే.. ఆర్థిక మంత్రి.. సూపర్ సిక్స్ లో భాగంగా మహా శక్తికి మొదటిగా ప్రాధాన్యత కల్పించామని తెలిపారు చంద్రబాబు. మా తల్లి పడిన కట్టెల పొయ్యి కష్టాన్ని చూసి తట్టుకోలేక ఆడ బిడ్డలను ఆదుకునే విధంగా దీపం పథకాన్ని ప్రారంభించానన్న ఆయన.. వైకుంఠపాళీ మాదిరిగా మారింది ప్రస్తుత పరిస్థితి.. నేను అభివృద్ధి చేస్తే.. వాటిని వీళ్ళు నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. By E. Chinni 18 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి TDP Chief Chandrababu fires on YSRCP at Amalapuram: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావన్నారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన మహిళా ప్రగతి కోసం ప్రజా వేదిక కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈసారి వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ప్రతీ ఇంట్లో మహిళలే.. ఆర్థిక మంత్రి.. సూపర్ సిక్స్ లో భాగంగా మహా శక్తికి మొదటిగా ప్రాధాన్యత కల్పించామని తెలిపారు చంద్రబాబు. వైసీపీవి దొంగ సర్వేలు.. వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలుపు కలగా జోస్యం చెప్పారు. మా తల్లి పడిన కట్టెల పొయ్యి కష్టాన్ని చూసి తట్టుకోలేక ఆడ బిడ్డలను ఆదుకునే విధంగా దీపం పథకాన్ని ప్రారంభించానన్న ఆయన.. వైకుంఠపాళీ మాదిరిగా మారింది ప్రస్తుత పరిస్థితి.. నేను అభివృద్ధి చేస్తే.. వాటిని వీళ్ళు నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు చంద్రబాబు.. 1996 తుపాను సమయంలో కోనసీమ ప్రాంతం విచ్ఛిన్నమయితే.. నా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాజమహేంద్రవరం కేంద్రంగా సెక్రటేరియట్ ఏర్పాటు చేసి సమస్యలను పూర్తిగా పరిష్కరించామని గుర్తుచేసుకున్నారు. ఆక్వా రైతాంగాన్ని వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ పై పెట్టేసిందని దుయ్యబట్టారు. ఆరు నెలలు ఓపిక పట్టండి.. ఆక్వా రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పారు చంద్రబాబు. డాక్టర్లు, టీచర్లు, లాయర్లతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం: అంతకు ముందు.. అమలాపురంలో డాక్టర్లు, టీచర్లు, లాయర్లతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ది కోసం బాబు అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. విజన్-2047 డాక్యుమెంట్ ప్రకారం రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రగతిరథంలో నడిపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మేథావులు, నిపుణుల నుంచి మరిన్ని సలహాలు, సూచనలు స్వీకరిస్తానని, ఎవరైతే రాష్ట్రాభివృద్ది చేస్తారో ఆలోచించి ఓట్లు వేయాలని సూచించారు. కులం, మతం, ప్రలోభాలకు లొంగితే రాష్ట్రం దెబ్బతింటుందని చంద్రబాబు తెలిపారు. చంద్రబాబుకు ఘన స్వాగతం: రెండు రోజులుగా చంద్రబాబు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు బాహుబలి పూతరేకుల దండతో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కొత్తపేటకు చెందిన టీడీపీ నాయకులు ఏకంగా మూడు వేల పూతరేకులతో 32 అడుగుల భారీ గజమాల తయారుచేయించారు. ఆత్రేయపురంకు చెందిన ఛాధస్తం పుతరేకుల తయారీ షాప్ నిర్వాహకులు ఈ గజమాలను తయారుచేశారు. 10 మంది రెండు రోజులు పగలు, రాత్రి కష్టపడి ఛాధస్తం షాపు నిర్వాహకులు దీనిని తయారు చేశారు. చంద్రబాబు కోనసీమ పర్యటనలో ఈ దండ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. #chandrababu #ysrcp #amalapuram #tdp-chief-chandrababu #tdp-chief-chandrababu-fires-on-ysrcp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి