TDP Chief Chandrababu: ఒక్క రోజులోనే నలుగురు అన్నదాతలు సూసైడ్.. చంద్రబాబు ఆవేదన రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu). ఒక్క రోజే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు బలవన్మరణాలు పొందడంపై ఆందోళన చెందారు. ఈ సందర్భంగా ఆదివారం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ప్రాంతంలో పర్యటనకు వెళ్లినా రైతు కష్టాలు, రైతాంగ సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు బలవన్మరణాలు పొదడం ఆవేదన కలిగించిందన్నారు చంద్రబాబు. By E. Chinni 20 Aug 2023 in రాజకీయాలు Scrolling New Update షేర్ చేయండి TDP Chief Chandrababu expressed grief over the suicides of Farmers: రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu). ఒక్క రోజే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు బలవన్మరణాలు పొందడంపై ఆందోళన చెందారు. ఈ సందర్భంగా ఆదివారం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ప్రాంతంలో పర్యటనకు వెళ్లినా రైతు కష్టాలు, రైతాంగ సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు బలవన్మరణాలు పొదడం ఆవేదన కలిగించిందన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ ఘటనతో అర్థం అవుతుందన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను ప్రభుత్వం తీవ్ర అంశంగా పరిగణించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాగుకు సబ్సిడీలు, పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతుకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. సాగుకు సబ్సిడీలు, పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతుకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక్క రోజులో నలుగురు అన్నదాతలను కోల్పోయిన పరిస్థితిని ప్రభుత్వం అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాలు, చర్యల ద్వారా రైతులు, కౌలు రైతులకు అండగా నిలవాలని అన్నారు చంద్రబాబు. కాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదివారం ఒకే రోజు నలుగురు రైతులు బలవన్మరనం చెందారు. అవుకు మండలం, కునుకుంట్లలో నాగేష్ (23)అనే యువ రైతు, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నందవరం మండలం, గురజాలకు చెందిన కురువ బీరప్ప (33), డోన్ మండలం, కొచ్చెర్వుకు చెందిన రైతు శివకుమార్ (31)లు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సీ బెలగల్ మండలం, ఇనగండ్లకు చెందిన శ్రీకృష్ణ దేవరాయ (52) పొలం దగ్గర ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా ప్రాంతాలకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. #chandrababu #kurnool #tdp-chief-chandrababu #farmers-suicide మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి