AP : ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు

ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా మండిపడ్డారు. టీడీపీ, వైసీపీలు బీజేపీతో కుమ్మక్కు అయ్యాయి. ఉత్తరాంధ్రను రెండు పార్టీలు మోసం చేశాయి. బీజేపీకి తొత్తులుగా ఉన్న రెండు పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఒడగొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

New Update
AP : ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయంటూ APCC చీఫ్ వైఎస్ షర్మిలా(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తో టీడీపీ(TDP), వైసీపీ కుమ్మక్కయ్యాయని ఆమె ఆరోపించారు. అంతేకాదు చంద్రబాబు(Chandrababu) కనిపించే పొత్తులు పెట్టుకుంటే.. వైసీపీ(YCP) కనిపించని పొత్తులు నడిపిస్తుందంటూ విమర్శలకు గుప్పించారు. బుధవారం విశాఖపట్నం(Visakhapatnam) జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ షర్మిలా తనదైన స్టైల్ లో వైసీసీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

పార్టీలన్నీ మోసం చేశాయి..
ఈ మేరకు 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్(CM JAGAN) అన్నగారు.. అధికారంలో వచ్చిన వెంటనే ఆ విషయం మరిచి పోయారన్నారు. ఒక్క రోజు కూడా జగన్ అన్న ఉద్యమం చేసింది లేదని, ఉత్తరాంధ్రను రెండు పార్టీలు మోసం చేశాయని మండిపడ్డారు. అలాగే ఇక్కడ ఉన్న కంపెనీలను ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా అప్పగిస్తున్నారని, గంగవరం పోర్టును అగ్గువగ అదానికి అమ్మేశారని ఆరోపించారు. 30 ఏళ్ల లీజు తర్వాత గంగవరం పోర్ట్ ప్రభుత్వ పరం కావాల్సి ఉంది. కానీ ఆ నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ వాటా 10 శాతం అగ్గువకే అమ్మేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం ఒక కుట్ర. ఇందిరమ్మ హయాంలో ఏర్పడిన విశాఖ స్టీల్ ను అమ్మే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: AP Politics : టీడీపీ లోకి వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి?

30 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు..
ఇక వైఎస్సార్ హయాంలో 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి నీ 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి కి పెంచారని గుర్తు చేసిన ఆమె.. ఇప్పుడు నష్టాల సాకు చూపి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 వేల మంది కార్మికులను రోడ్డున పడేస్తున్నారని, వైఎస్సార్ హయాంలో నష్టాల్లో ఉన్న కంపెనీలను కేంద్ర ప్రభుత్వ కంపెనీలలో విలీనం చేశారని తెలిపారు. విశాఖకు రైల్వే రోజ్ ఇచ్చారు. ఇంకా అమలు కాలేదు. మెట్రో రైల్ ప్రాజెక్టు(Metro Rail Project) పత్తా లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏది కావాలంటే అది జరిగింది. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో రావాలి. బీజేపీ(BJP) తొత్తులుగా ఉన్న వైసీపీ, టీడీపీలను ఓడగొట్టాలి. బీజేపీతో ఇక్కడ పార్టీలు దోస్తీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని పార్టీ క్యార్యకర్తలకు షర్మిలా పిలుపునిచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు