TCS: టీసీఎఎస్ శుభవార్త..ఫ్రెషర్స్ కోసం భారీ రిక్రూట్‎మెంట్..చివరి తేదీ ఇదే.!

2024లో ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకు టీసీఎస్ గుడ్ న్యూస్ చెప్పింది. బీటెక్ , ఎమ్మెస్సీ, ఎంఎస్, ఎంసీఏ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి ఫ్రెషర్ పొజిషన్స్ కోసం దరఖాస్తులను కోరుతోంది. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి.

New Update
TCS: టీసీఎస్‌కు రూ.1600కోట్లు జరిమానా

TCS Hiring:  2024లో ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్న విద్యార్థులకు టీసీఎస్ శుభవార్త చెప్పింది. ఫ్రెషర్స్ నుంచి దరఖాస్తులను కోరతున్నట్లు వెల్లడించింది. ఈమధ్య కాలంలో పలు ఐటీ కంపెనీల్లో రిక్రూట్ మెంట్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2024లో బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఎస్ పూర్తి చేస్తున్న బ్యాచ్ నుంచి టీసీఎస్ రిక్రూట్ మెంట్ చేపడుతుంది. ఈ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఏప్రిల్ 10. రిక్రూట్మెంట్ కు సంబంధించిన పరీక్ష ఏప్రిల్ 26న జరుగుతుందని కంపెనీ అధికారిక వెబ్ సైట్ పేజీలో పేర్కొంది.

ఈ సంస్థ నింజా(TCS Ninja) , డిజిటల్ (TCS Digital), ప్రైమ్ అనే మూడు కేటగిరీల్లో దరఖాస్తులు కోరుతోంది. నింజా వర్గం సంవత్సరానికి రూ. 3.36 లక్షలు, డిజిటల్, ప్రైమ్ కేటగిరీలు వరుసగా రూ. 7 లక్షలు రూ. 9-11.5 లక్షల ప్యాకేజీని అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఎన్ని పోస్టులను భర్తీ చేస్తుందో కంపెనీ వెల్లడించలేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకునే ప్రక్రియ ప్రారంభమైందని కంపెనీ జనవరిలో తెలిపింది.

"మేము వచ్చే ఏడాదికి మా క్యాంపస్ నియామక ప్రక్రియను ప్రారంభించాము. TCSలో చేరడానికి ఫ్రెషర్‌లలో విపరీతమైన ఉత్సాహాన్ని చూస్తున్నాము" అని TCS చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు.2023-24 ఆర్థిక సంవత్సరంలో టెక్ పరిశ్రమ 60,000 కొత్త ఉద్యోగాలను సృష్టించనుందని ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ఫిబ్రవరిలో తెలిపింది. "కోవిడ్ సంవత్సరంలో చాలా ఎక్కువగా రిక్రూట్ మెంట్స్ జరిగాయని..అందుకే ఆ తరువాత కొంత కరెక్షన్ జరిగినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ భార్య సునీత?

Advertisment
Advertisment
తాజా కథనాలు