Kashmir: 'గాజాకు పట్టిన గతే కశ్మీర్‌కు పడుతుందా'? చర్చలేవి? కశ్మీర్ సమస్యలను పాకిస్థాన్‌తో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. అలా చేయకపోతే గాజా, పాలస్తీనాలకు పట్టిన గతే మనకూ పడుతుందని హెచ్చరించారు. By Trinath 26 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ప్రస్తుతం గాజా(Gaza) పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఇజ్రాయెల్(Israel)-హమాస్(Hamas) యుద్ధం మధ్య గాజా నలిగిపోతోంది. ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. యుద్ధం మొదలై నెలలు గడుస్తోన్న ఇప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. నిజానికి గాజా సమస్య ఈనాటిది కాదు.. దశాబ్దాలుగా మూలుగుతున్న సమస్య వాళ్లది. ఇటు ఇండియాలోని కశ్మీర్(Kashmir) సమస్య కూడా దాదాపు అంతే. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొన్నాళ్లు ఉగ్రదాడులు తగ్గినట్టు అనిపించినా ప్రస్తుతం మళ్లీ తుపాకీ తూటాల మోత మారుమోగుతున్నాయి. హింస రాజ్యమేలుతోంది. పూంచ్(Poonch)లో వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. పూంచ్‌లో పౌర మరణాలతో పాటు సైనికుల మరణాలూ చోటుచేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే అంశంపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో గాజా అవుతుంది: భారత్, పాకిస్థాన్ మధ్య వివాదాలను చర్చల ద్వారా ముగించకపోతే గాజా, పాలస్తీనాలకు పట్టిన గతే కశ్మీర్‌కు పడుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. గత వారం పూంచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో నలుగురు భారత ఆర్మీ జవాన్లు మరణించడం, ఇతరులు గాయపడటం, ఆ తర్వాత జరిగిన ముగ్గురు పౌరుల మరణాలను అబ్దుల్లా ప్రస్తావించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వ్యాఖ్యలను గుర్తు చేశారు ఫరూక్. మన స్నేహితులను మార్చుకోవచ్చు కానీ పొరుగువారిని మార్చలేమని వాజ్‌పేయి చెప్పినట్టు అబ్దుల్లా వివరించారు. ఇంటర్నెట్ సేవలు బంద్: అదే సమయంలో ప్రధాని మోదీ మాటలను కూడా గుర్తు చేశారు ఫరూక్. ఇరుగు పొరుగు దేశాలతో స్నేహంగా ఉంటే అందరూ పురోగతి సాధిస్తారని... యుద్ధం ఆప్షన్ కాదని.. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ గతంలో చెప్పిన విషయాన్నిమరోసారి గుర్తు చేశారు ఫరూక్ అబ్దుల్లా. రాజౌరీ-పూంచ్‌లో కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా డేరా కీ గలీ, బఫ్లియాజ్ అటవీ ప్రాంతంలో వైమానిక నిఘా 7వ రోజుకు చేరుకుంది. దీంతో అక్కడ మొబైల్ ఇంటర్నెట్ సేవలను వరుసగా నాలుగో రోజు నిలిపివేశారు. Also Read: ధోనీ, కోహ్లీ వల్ల కాలేదు.. మరి రోహిత్ చరిత్ర సృష్టిస్తాడా? 31ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడా? WATCH: #jammu-kashmir #poonch #farooq-abdullah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి