Health Tips: చలికాలంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఇవి తినాల్సిందే!
చలికాలంలో ఎముకలు బలహీనం కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే రాగి జావ, డ్రైఫ్రూట్స్, పైనాపిల్‌ను డైట్లో చేర్చుకోవాలి. వీటిని డైలీ తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో ఎముకలు బలహీనం కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే రాగి జావ, డ్రైఫ్రూట్స్, పైనాపిల్‌ను డైట్లో చేర్చుకోవాలి. వీటిని డైలీ తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఈ సీజన్లో రాత్రిపూట బయటకు వెళ్లేటప్పుడు స్వెటర్, చేతులకు గ్లౌజ్‌లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు కేవలం వేడి పదార్థాలు తీసుకోవడంతో పాటు స్నానం కూడా వేడి నీరుతో చేయాలని నిపణులు అంటున్నారు.
ఈ రోజుల్లో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. పెద్ద నాయకుల నుండి సెలబ్రిటీల వరకు యువకుల నుండి వృద్ధుల వరకు దీని బారిన పడుతున్నారు. ఆశ్చర్యకరంగా, చాలా గుండెపోటులు బాత్రూంలో సంభవిస్తాయి. అది ఎందుకో తెలుసా?
పచ్చి బఠానీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే ప్రోటీన్లు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీర కండరాలకు కూడా గ్రీన్ పీస్ మంచివి. రక్తపోటును నియంత్రించడంతో పాటు మలబద్ధకం సమస్యలకు పచ్చి బఠానీలు చెక్ పెడతాయి.
శీతాకాలంలో ఎండ చేసే మేలు అంతాఇంతా కాదు. శీతాకాలపు సూర్యుడు రోగనిరోధక శక్తికి టానిక్‌లా పని చేస్తాడు. ఎండ నుంచి వచ్చే విటమిన్-డి వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. చల్లటి వాతావరణంలో ఎండలో కూర్చోవడం వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది.
శీతాకాలంలో ఎదుర్కొనే ప్రధాన సమస్యలు అయినటువంటి జలుబు, దగ్గు, అజీర్ణం వంటి సమస్యలకు జామ ఆకుల టీ తో చెక్ పెట్టవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుందని వివరిస్తున్నారు.
నెయ్యి అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ప్రతి ఆహార పదార్థాలతోపాటు అన్నంలో ఈ నెయ్యి అనేది కచ్చితంగా వేసుకొని తింటారు. ముఖ్యంగా చలికాలంలో రోజూ నెయ్యి తింటే జీర్ణ సమస్యలతోపాటు మలబద్దక, కడుపు ఉబ్బరం, గ్యాస్, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
చలికాలంలో ఎక్కువగా తుమ్ములు, రకాల వైరస్లు మనపై దాడి చేస్తూ ఉంటాయి. వైరస్, బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వంటివి తగ్గాలంటే జీలకర్ర కషాయం చాలా మంచిది. జీలకర్ర కషాయం రోజూ తాగితే మలబద్ధకం, కడుపులో గ్యాస్ సమస్యలు కూడా తగ్గుతాయి.
చలికాలంలో వేడినీటితో స్నానం చేయాలనిపిస్తుంది. కానీ, ఇది చాలా ఇబ్బందులు తెస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, గోరువెచ్చని నీటిని ఉపయోగించవచ్చు. ఇక అన్నికాలాల్లోనూ వేడినీటిని ఉపయోగించేవారికి జుట్టు రాలిపోవడం, డిప్రెషన్ వచ్చే ప్రమాదం, కళ్ళ చుట్టూ ముడతలు రావడం జరగవచ్చు.