Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.. ప్రపంచదేశాలకు WHO హెచ్చరిక!
గత కొన్ని రోజులుగా 84 దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని WHO తెలిపింది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్త కోవిడ్ వేరియంట్లు కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
గత కొన్ని రోజులుగా 84 దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని WHO తెలిపింది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్త కోవిడ్ వేరియంట్లు కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
భారతీయులు సగానికి పైగా ఫిజికల్ యాక్టివిటీపై దృష్టి సారించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. యువత 30 ఏళ్లు కూడా దాటకముందే అనేక వ్యాధుల బారిన పడుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడించింది. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలని సూచించింది.
భారత్‌లో మరో ప్రమాదకర వైరస్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లోని నాలుగేళ్ల చిన్నారిలో H9N2 వైరస్ వల్ల మానవులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు పేర్కొంది. 2019లో ఈ వైరస్ మొదటి కేసు నమోదు అయినట్లు తెలిపింది.
ఆస్ట్రేలియాలో నమోదైన బర్డ్ ఫ్లూ కేసు ఆస్ట్రేలియా నుంచి వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. బర్డ్‌ఫ్లూతో బాధపడిన చిన్నారి కొలకత్తాకు వెళ్ళినట్టు డబ్ల్యూహెచ్‌వో ధృవీకరించింది.
బర్డ్ ఫ్లూ తో ఓ వ్యక్తి మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.గత ఏప్రిల్ నెలలో మెక్సికోలో బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తి మృతి చెందాడని..ఆ వ్యక్తికి వైరస్ ఎలా వ్యాపించిందో కచ్చితంగా చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
కరోనా మహమ్మారి కారణంగా మనుషుల ఆయుర్దాయం తగ్గిపోయిందని WHO తాజా నివేదిక వెల్లడించింది. మనుషుల జీవిత కాలాన్ని ఒకటిన్నర సంవత్సరాలు తగ్గించిందని చెప్పింది. 2012లో భారత్ లో సగటు ఆయుర్దాయం 71 ఏళ్లకు ఉండేదని, కరోనా ఎఫెక్ట్ తో మళ్లీ ఇదే పరిస్థితి నెలకొందని చెప్పింది.
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మలేరియా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా ఉంది. ఈ ప్రాణాంతక వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రపంచ ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉద్దేశం.