ఇంటర్నేషనల్ Putin: ఉక్రెయిన్ బలగాలే రష్యా సైనిక రవాణా విమానాన్ని కూల్చేశాయి ఇటీవల ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైనిక రవాణా విమానం కూలడంతో ఉక్రెయిన్ బలగాలే ఆ విమానాన్ని కూల్చేశాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. వాళ్లు పొరపాటున చేశారా లేదా ఉద్దేశపూర్వకంగా చేశారా నాకు తెలియదు.. కానీ ఇది నేరం అంటూ ఓ టీవీ ప్రసంగంలో చెప్పారు. By B Aravind 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Putin: మా లక్ష్యాలు నెరవేరేవరకు యుద్ధం ఆపేది లేదు.. పుతిన్ సంచలన వ్యాఖ్యలు ఉక్రెయిన్‌పై తమ లక్ష్యాల్లో ఎలాంటి మార్పు ఉండదని.. తమ లక్ష్యాలు నెరవేరేవరకు శాంతి నెలకొల్పడం వీలు కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌కు నాజీల నుంచి విముక్తి కల్పించి.. నిస్సైనికీకరణ జరిగేలా, నాటోలో చేరకుండా తటస్థంగా ఉండేలా చేయడమే తమ లక్ష్యాలని తెలిపారు. By B Aravind 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Putin : రష్యాలో మార్చిలో ఎన్నికలు.. పుతిన్ పోటీ చేస్తారా..? రష్యా ఎన్నికలను వచ్చే ఏడాది మార్చి 17న నిర్వహించాలని అక్కడి చట్ట సభ్యులు నిర్ణయించారు. అయితే ఈ ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (71) తెలిపారు. పుతిన్ రాబోయే ఎన్నికల్లో కూడా గెలవడం కాయమని అక్కడివారు భావిస్తున్నారు. By B Aravind 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Putin: ప్రియురాలిని 111 సార్లు కత్తితో పొడిచిన హంతకుడు.. క్షమాభిక్ష పెట్టిన పుతిన్.. రష్యాలో తన మజీ ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని ఆమెను అత్యాచారం చేసి 111 సార్లు కత్తితో పొడిచిన హంతకుడికి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టారు. అలాగే అతడ్ని సైనికుడిగా ఉక్రెయిన్ సరిహద్దుకు పంపించారు. బాధితురాలు తల్లి హంతకుడ్ని అలా వదిలేయడాన్ని తీవ్రంగా ఖండించారు. By B Aravind 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Breaking: రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గుండె పోటు? రష్యా అధ్యక్షుడు పుతిన్ గుండె పోటుకు గురయ్యారంటూ వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే.. ఆ దేశ అధికార వర్గాలు మాత్రం ఇంత వరకు ఈ విషయంపై స్పందించలేదు. By Nikhil 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vladimir Putin: చైనాలో పుతిన్‌కు చేదు అనుభవం.. సభలో మాట్లాడుతుండగానే.. చైనాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌కు చేదు అనుభవం ఎదురైంది. బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగం ప్రారంభించగానే.. ఐరోపాకు చెందిన నేతలు, ప్రతినిధులు సభ నుంచి వెళ్లిపోయారు. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ భవనంలో బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి పుతిన్‌తో పాటు వివిధ దేశాల నేతలు, అలాగే 1000 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పుతిన్ మాట్లాడుతుండగా.. ఇలా ఐరోపా నేతలు మధ్యలోనే వెళ్లిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. By B Aravind 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America Warning: రష్యా, ఉత్తర కొరియాలకు అమెరికా వార్నింగ్..ఆయుధాల ఒప్పందం చేసుకున్నారో..!! ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కిమ్‌తో పుతిన్ భేటీ సైనిక ఒప్పందం దిశగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇరు దేశాలపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. By Bhoomi 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kim Jong Un in Russia: వారిద్దరి భేటీతో...ఉక్రెయిన్ గుండెల్లో గుబులు..!! ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యాపర్యటనకు వెళ్లారు. త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవనున్నట్లు సమాచారం. ఇద్దరు శక్తివంతమైన నాయకులు కలుస్తున్నారన్న వార్త ఉక్రెయిన్ గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది. అటు ఇది పాశ్చాత్య దేశాలలో ఉద్రిక్తతను సృష్టించింది. ఇరు దేశాల నేతలు ఎప్పుడు భేటీ అవుతారు..ఎలాంటి అంశాలపై చర్చిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. By Bhoomi 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn