BREAKING : తిరుమలలో చిరుత సంచారం.. భక్తులకు టీటీడీ హెచ్చరికలు!
తిరుమలలో మళ్లీ చిరుత కలకలం రేపింది. నడకమార్గం పక్కనున్న అటవీప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులకు హెచ్చరికలు జారీ చేసింది టీటీడీ.
తిరుమలలో మళ్లీ చిరుత కలకలం రేపింది. నడకమార్గం పక్కనున్న అటవీప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులకు హెచ్చరికలు జారీ చేసింది టీటీడీ.
ఇంటి స్థలాలు పంపిణీ, జీతాల పెంపు లాంటి నిర్ణయాలతో ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. కల్యాణ కట్ట పీస్ రేట్ క్షురకులకు నెలకు రూ.20వేల వేతనం ఇవ్వాలని నిర్ణయించారు.
వైకుంఠ ఏకాదశి వేల తిరుమలలో భక్తులు కిక్కిరిసిపోయారు. వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు మాజీ సీజేఐ ఎన్వీ రమణ, ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు, సినీ ప్రముఖలు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకున్నారు.
ఈ నెల 23 నుంచి జనవరి 1 వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. శుక్రవారం తిరుపతిలో జారీ చేసే సర్వ దర్శన టోకెన్లను రద్దు చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి వైకుంఠ ద్వారా దర్శన టోకెన్లను కేటాయించనున్నట్లు వివరించారు
శ్రీవారి భక్తులకు మార్చి నెలకు సంబంధించిన సేవా టికెట్లను విడుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి దర్శనం, ఆర్జితా సేవా టికెట్ల వివరాలను ఆన్లైన్ లో టికెట్ల వివరాలను ప్రకటించింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈఈ (ఎలక్ట్రికల్)లో మిగిలివున్న పోస్టులను భర్తీ చేసేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. బీఈ పాసై, ఏపీలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు డిసెంబర్ 19లోగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.
తిరుమలలో హైదరాబాద్లో దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. గర్భగుడిలో స్వామి దర్శనం చేసుకునే సమయంలో టీటీడీ సిబ్బంది చెయ్య పట్టుకుని లాగేసినట్లు తెలస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండని సమాధానం ఇచ్చారని చెబుతున్నారు.
తిరుమల పుణ్యక్షేత్రంలో గత వారం రోజులుగా ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి .రోజంతా వర్షం కురుస్తుండడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తిరుమల శ్రీవారి నిధులు దారిమళ్లుతున్నాయని బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించే కానుకలను ధర్మప్రచారం కోసమే టీటీడీ వినియోగించాలని డిమాండ్ చేశారు. శనివారం తిరుమలలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.