PM Modi : చరిత్ర సృష్టించిన మోదీ.. రాజకీయాల్లో సరికొత్త మైలురాయి!
భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. దేశంలో ఎన్నికైన ప్రభుత్వానికి అత్యధిక కాలం నాయకత్వం వహించిన వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.
భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. దేశంలో ఎన్నికైన ప్రభుత్వానికి అత్యధిక కాలం నాయకత్వం వహించిన వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.
ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఈ యుద్ధం ఎంత కాలం సాగినా భరించడానికి అమెరికా ఆర్థికంగా సిద్ధంగా ఉందని ట్రంప్ బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం నాలుగో వారంలోకి ఎంటరైంది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ఒక కీలక ప్రకటన చేసింది.
అమెరికా తీసుకున్న నిర్ణయాలు క్యూబాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో విద్యుత్ సంక్షోభం నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం అక్కడ 10 నుంచి 20 గంటలకు పైగా విద్యుత్ కోతలు ఉన్నాయి.
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఇరాన్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నుంచి గ్రీన్‌లాండ్‌ను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
విమానం టేకాఫ్ అయిన కాసేపటికే విషాదం జరిగింది. ఓ ప్రయాణికురాలు మృతి చెందడం కలకలం రేపింది. హాంగాంగ్ నుంచి లండన్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. కోళికోడ్ జిల్లాలోని షిగెల్లా అనే వ్యాధి వ్యాప్తిస్తోంది. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని ఎరంజికల్ అనే ప్రాంతంలో తాజాగా 12 మందికి ఈ వ్యాధి సోకింది.
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసింది. డిమోనా నగరంలోని ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన అణు పరిశోధనా కేంద్రం టార్గెట్‌గా బాలిస్టిక్ మిస్సైళ్లతో విరుచుకుపడింది.
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. వాయిస్ అసిస్టెంట్ అలెక్సాతో సహా అభివృద్ధి చేసిన అమెజాన్ సర్వీసెస్‌తో ఈ ఫోన్ లింక్ అయ్యేలా ఉంటుందని తెలుస్తోంది.