Accident: ORRపై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం కలకలం రేపింది. ముందు వెళ్తున్న కంటైనర్ను ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం కలకలం రేపింది. ముందు వెళ్తున్న కంటైనర్ను ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది.
తెలంగాణలో విషాదం నెలకొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం కన్నుమూశారు. 2022లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఆమె మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోని బీసీ కమ్యూనిటీలో ఆరు కులాలు వాటి పేర్లు త్వరలో మారనున్నాయి. దొమ్మర, పిట్చిగుంట్ల, తమ్మాలి, బుడబుక్కల,ఆర్య క్షత్రియ, వీరముష్టి ఈ కులాల వాళ్లు తమ కమ్యూనిటి పేర్లు మార్చమని బీసీ కమిషన్కు ప్రతిపాదన చేశారు. త్వరలోనే వీటి పేర్లు మారనున్నాయి.
ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ధాన్యం దిగుబడే నిదర్శమన్నారు. శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కొత్త దరఖాస్తులకు అప్లై చేసుకోవాలనుకునే వారికి మే నెలా కోటాను కూడా విడుదల చేసింది. అలాగే దాదాపుగా 20 శాతం పెండింగ్ దరఖాస్తులను పరిష్కారం చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లో 15 సంవత్సరాలు దాటిన 2 వేలు 500 బస్సులు రోడ్డుపై తిరుగుతున్నాయి. నగరంలోని ప్రతి ఎనిమిది విద్యా సంస్థల బస్సులలో సుమారు ఒకటి 15 సంవత్సరాలు దాటిందని, అలాంటివి దాదాపు 2,500 బస్సులు ఇప్పటికీ నడుస్తున్నాయని డేటా వెల్లడిస్తోంది.
వైద్య విద్య ప్రవేశాలకోసం నిర్వహించే NEET పరీక్ష మే 4న జరగనుంది. తెలంగాణలో 24 జిల్లాల్లో 190 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రం నుంచి 72,572 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.
కులగణన అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల కులగణన సర్వేలకు పారదర్శకత లేదని కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్ వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. తెలంగాణ సర్వే రద్దు చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.