రాజకీయాలు TS Politics: రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజున రాహుల్ అపాయిట్మెంట్? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 25న హస్తం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాహుల్ అపాయిట్మెంట్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. By Nikhil 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS BJP: నాకు బీజేపీ అన్యాయం చేసింది.. మహిళా నేత కన్నీరు.. పార్టీకి రాజీనామా! బీజేపీకి నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రామాదేవి పార్టీకి రాజీనామా చేశారు. ఇన్నాళ్లూ కష్టపడి పని చేసిన తనకు టికెట్ ఇవ్వకుండా పార్టీ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానన్నారు. By Nikhil 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మంత్రి పదవి ఇచ్చినా అందరినీ మోసం చేశావ్.. తుమ్మలకు పువ్వాడ కౌంటర్.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.. బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మంత్రి పువ్వాడ.. తుమ్మలపై ఫైర్ అయ్యారు. రౌడీయిజం, గుండాయిజం పెంచి పోషించింది నువ్వు కాదా.. అంటూ ధ్వజమెత్తారు. నువ్వు మంత్రిగా ఉన్న సమయంలో ఎంతమంది రాజకీయ సమాధీ అయ్యారో తెలియదా అంటూ ప్రశ్నించారు. సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు ఇచ్చిన పదవులు పొంది వాళ్లని మోసం చేసి.. చివరికి కేసీఆర్ దగ్గర చేరావని.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లావంటూ ఎద్దేవా చేశారు. ఖమ్మం ప్రజల్ని ఎవరు మోసం చేశారో వాళ్లే ఎన్నికల్లో నిర్ణయిస్తారంటూ వ్యాఖ్యానించారు. By B Aravind 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Congress Second List: దసరా తర్వాతే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. ఆలస్యానికి కారణమిదే? తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ దసరా తర్వాతనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన అన్ని స్థానాలకు ఒకే సారి అభ్యర్థులను ఖరారు చేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ఎక్కువగా పోటీ ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులతో అధిష్టానం నేరుగా మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలోనే లిస్ట్ ఆలస్యమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. By Nikhil 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Big News: బీఆర్ఎస్కు సుప్రీంకోర్టు షాక్.. ఎన్నికల్లో కష్టాలు తప్పేలా లేవుగా..! తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఎన్నికల గుర్తుల కేటాయింపునకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 'రోడ్డు రోలర్', 'చపాతి మేకర్' లాంటి ఎన్నికల గుర్తులను కేటాయుంచద్దని, ఆ మేరకు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం.. బీఆర్ఎస్ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. By Shiva.K 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana BJP: బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదా? తెలంగాణలో బీజేపీ నయా స్ట్రాటజీ.. బండి సంజయ్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం ఆయనకు వేరే బాధ్యతలు అప్పగించింది. దాని ఫలితంగా ఎమ్మెల్యే క్యాండిడేట్‌గా బండి నిలబడతారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్‌ను ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. దాంతో ఆయన ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది. By Shiva.K 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: చంద్రబాబు అరెస్ట్, ఓటుకు నోటు కేసుపై హరీశ్ రావు సంచలన కామెంట్స్! చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై సంచలన కామెంట్స్ చేశారు మంత్రి హరీష్ రావు. బాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు. కక్షపూరితమైన పాలిటిక్స్ అనేది మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటై తొమ్మిదిన్నర ఏళ్లలో ఏనాడూ తాము ఇలా రాజకీయాలు చేయలేదున్నారు. ఒకవేళ తామే చేయాలనుకుంటే.. ఓటుకు నోటు కేసు సహా అనేక అంశాల్లో ఎవరూ జైలు నుంచి బయటకు రాకపోయేవారని వ్యాఖ్యానించారు. By Shiva.K 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణతో మాకున్నది ప్రేమానురాగాల బంధం.. రాహుల్ ఆసక్తికర కామెంట్స్.. తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం జోరుగా సాగుతోంది. మంథనిలో రోడ్ షో నిర్వహించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. '2004 లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చింది.. రాష్ట్రం ఏర్పాటు చేసి ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుంది' అని గుర్తు చేశారు. అయితే, ఏ ఆకాంక్షలతో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందో ఆ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. By Shiva.K 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Elections: 'బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయం'.. కాంగ్రెస్‌ను ఆడుకున్న మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. విభజన హామీలపై రాహుల్ ఎందుకు నోరు తెరవడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ బస్సు యాత్రపై ట్విట్టర్లో నిప్పులు చెరిగారు కేటీఆర్. తెలంగాణ హక్కులపై ఎన్డీయేను ఏనాడూ ప్రశ్నించని రాహుల్‌కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు. By Shiva.K 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn