BREAKING: 100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టు భవనం
తెలంగాణలో కొత్త హైకోర్టు భవన నిర్మాణం కోసం రేవంత్ సర్కార్ 100 ఎకరాల భూమి కేటాయించింది. రాజేంద్ర నగర్ బుద్వేల్, ప్రేమావటిపేటలో స్థలం కేటాయిస్తూ జీవో 55 విడుదల చేసింది.
తెలంగాణలో కొత్త హైకోర్టు భవన నిర్మాణం కోసం రేవంత్ సర్కార్ 100 ఎకరాల భూమి కేటాయించింది. రాజేంద్ర నగర్ బుద్వేల్, ప్రేమావటిపేటలో స్థలం కేటాయిస్తూ జీవో 55 విడుదల చేసింది.
తెలంగాణలో కానిస్టేబుల్ నియామకాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాలుగు మార్కులు కలపాలన్న సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఇండిపెండెంట్ నిపుణుల కమిటీ పరిశీలన తర్వాత నాలుగు వారాల్లో తుది ఫలితాలను విడుదల చేయాలని ఆదేశించింది.
వ్యూహం సినిమా CBFC సర్టిఫికేట్ తెలంగాణ హైకోర్టు రద్దు చేసిందని జరుగుతున్న ప్రచారానికి ఆర్జీవీ చెక్ పెట్టారు. వ్యూహం సర్టిఫికేట్ ను హైకోర్టు రద్దు చేయలేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
వ్యూహం సినిమాపై హైకోర్టును ఆశ్రయించారు నారా లోకేష్. ఆ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు, టీడీపీని దెబ్బతీసే కుట్రలో భాగంగానే వ్యూహం సినిమా తీశారని ఆరోపించారు లోకేష్. సినిమాను అడ్డుకోవాలని పిటిషన్లో కోరారు.
తెలంగాణలో మరో కొత్త కట్టడానికి అడుగులు పడుతున్నాయి. రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టును నిర్మించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు భవనం శిధిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
శంషాబాద్‌లోని 181 ఎకరాల భూములు హెచ్ఎండీఏవే అని హైకోర్టు స్పష్టం చేసింది. భూ అక్రమదారుల పిటిషన్ ను డిస్మిస్ చేసింది హైకోర్టు. నవంబర్ 18న తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్.. నేడు తీర్పు వెలువరించింది.
క్రిమినల్ కేసులలో నిందితులుగా.. విచారణ ఎదుర్కుంటున్న వారి పాస్ పోర్ట్ రెన్యువల్ చేయడానికి పాస్ పోర్ట్ ఆఫీసులు నిరాకరిస్తాయి. మంచీర్యాలకు చెందిన వెంకటేశం ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించడంతో నిందితులకు ప్రాథమిక హక్కులు ఉంటాయని.. అతని పాస్ పోర్ట్ రెన్యువల్ చేయాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన నేపథ్యంలో నెలకొన్న ఆలిండియా సర్వీస్ అధికారుల కేటాయింపు వివాదానికి సంబంధించి పిటిషన్లపై నవంబర్ 20వ తేదీ నుంచి రోజూ విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు తెలిపింది.
టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియమాకాలను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొత్తం 37 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా టీఎస్పీఎస్సీ ముందుకెళ్తోందని వారు ఆరోపించారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. తప్పు ప్రశ్నలపై వివరణ ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది.