TDP: టీడీపీకి ఎంపీ గల్లా జయదేవ్ గుడ్‌బై!
రాజకీయాలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై చెప్పారు. ఈ సారి ఎన్నికలకు దూరంగా గల్లా జయదేవ్ ఉండనున్నారు. ఇప్పటికే అధిష్టానానికి ఆయన సంకేతాలు పంపినట్లు సమాచారం. ఈ నెల 28న లోకేష్ తో ఆయన భేటీ కానున్నారు.
రాజకీయాలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై చెప్పారు. ఈ సారి ఎన్నికలకు దూరంగా గల్లా జయదేవ్ ఉండనున్నారు. ఇప్పటికే అధిష్టానానికి ఆయన సంకేతాలు పంపినట్లు సమాచారం. ఈ నెల 28న లోకేష్ తో ఆయన భేటీ కానున్నారు.
ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా మండిపడ్డారు. టీడీపీ, వైసీపీలు బీజేపీతో కుమ్మక్కు అయ్యాయి. ఉత్తరాంధ్రను రెండు పార్టీలు మోసం చేశాయి. బీజేపీకి తొత్తులుగా ఉన్న రెండు పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఒడగొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
విజయవాడ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వంగవీటి రాధా, బోండా ఉమా వర్గీయుల మధ్య పెద్ద యుద్దమే నడుస్తుంది.
టీడీపీతో కలిసి పనిచేయడం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో పనిచేయమని చంద్రబాబు అడిగారని అయితే అది కుదరదని చెప్పినట్టు తెలిపారు. తన ఇద్దరి కామన్ ఫ్రెండ్ ఫోర్స్ చేయడం వల్లే విజయవాడ వెళ్లానని బాంబు పేల్చారు.
విశాఖ నుంచి అరకు సభకు వెళ్తున్న చంద్రబాబు హెలికాప్టర్లో సమన్వయ లోపం తలెత్తింది. ఏటీసీతో పైలట్‌కు సమన్వయ లోపం ఏర్పడడంతో నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో హెలికాప్టర్ ప్రయాణించింది. కొంత సమయం తరువాత మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి లభించింది.
గుడివాడ సభ వేదిక మీద నుంచి కృష్ణాజిల్లాలో మూడు నియోజకవర్గాల టీడీపీ అభ్యర్దులను కన్ఫర్మ్ చేశారు చంద్రబాబు. గుడివాడలో వెనిగండ్లరాము , మచిలీపట్నంలో కొల్లురవీంద్ర, గన్నవరంలో యార్లగడ్డను గెలిపించాలని చంద్రబాబు కోరారు.
గుడివాడలో పొటికల్ గొడవ మొదలైంది. ఎన్టీయార్ వర్ధంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. చంద్రబాబు, వైసీపీ ఎమ్మెల్యే కొడాలినాని ఇద్దరూ ఎన్టీయార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడి వాతావరణం టెన్షన్ టెన్షన్ గా మారింది.
టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఉన్న ఫైబర్ నెట్ కేసులో ఆయన దాకలు చేసిన ముందస్తు బెయిల్ మీద నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంలో సవాల్ చేశారు. చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో టీడీపీ అధినేత బాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇరువురు నేతలూ చర్చించినట్టు సమాచారం. ఇందులో ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాట్లపై చర్చలు జరిగాయని తెలుస్తోంది.