Fact Check Unit: ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నోటిఫికేషన్ పై సుప్రీం కోర్టు స్టే
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ నిబంధనలు 2023 ప్రకారం ఫాక్ట్-చెక్ యూనిట్ (FCU) యూనియన్ నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు గురువారం (మార్చి 21) స్టే విధించింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ నిబంధనలు 2023 ప్రకారం ఫాక్ట్-చెక్ యూనిట్ (FCU) యూనియన్ నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు గురువారం (మార్చి 21) స్టే విధించింది.
ఎన్నికల టైమ్‌లో ఉచిత హామీల మీద నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ మీద విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్ గురించి తాము చర్చించుకున్నామని...దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉందని తాము భావించామని జస్టిస్ డీ.వై చంద్రచూడ్ త్రిసభ్య ధర్మాసనం తెలిపింది.
పతంజలి యాడ్స్ విషయంలో సుప్రీం కోర్టుకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ ఈరోజు అటువంటి ప్రకటనలను నిలిపివేస్తామని తెలియచేశారు. పతంజలి ఉత్పత్తుల తప్పుడు ప్రకటనలపై సుప్రీం కోర్టు నిషేదం విధించింది. రామ్‌దావ్ బాబా. బాలకృష్ణలకు సమన్లను జారీ చేసింది.
ఢిల్లీ మద్యం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెనక్కు తీసుకున్నారు. ఆల్రెడీ ఈడీ అరెస్టు చేయడంతో దీనిపై విచారణ అవసరం లేదని పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
సీఏఏ అమలు మీద ఇండియన్ ముస్లింలీగ్ దాఖలు చేసిన పిటిషన్ మీద స్పందించాలంటూ సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాలలోపు ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశించింది.
తప్పపుదోవ పట్టించే యాడ్స్ కేసులోని ధిక్కార పిటిషన్ మీద సమాధానం ఇవ్వడంలో రామ్‌దేవ్ బాబా, పతంజలి కంపెనీలు విఫలమయ్యాయిన సుప్రీంకోర్టు మండిపడింది. దీనికి సంభంధించి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, రామ్‌దేవ్ బాబా ఇద్దరూ కోర్టుకు హాజరుకవాలని సమన్లను జారీ చేసింది.
తన అరెస్ట్ అక్రమం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిబంధనల మేరకు పూర్తిగా సమర్పించిన తర్వాతనే విచారణ చేస్తామని తెలిపింది. అప్పటివరకు విచారణనను వాయిదా వేస్తున్నామని కోర్టు చెప్పింది.
ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఇప్పటికి ఎస్బీఐకు మూడుసార్లు మొట్టికాయలు వేసినా ఈ బ్యాంక్ తీరు మార్చుకోలేదు. దాంతో ఇప్పుడు మరో సారి ఎలక్టోరల్ బాండ్స్ పూర్తి సమాచారాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ లీడర్ సత్యేంద్ర జైన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. జస్టిస్ బేల ఎం త్రివేది ధర్మాసనం ఢిల్లీ మాజీ మంత్రి బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. సత్యేంద్ర వెంటనే పోలీసులకు లొంగిపోవాలని కోర్టు సూచించింది.