Latest News In Telugu సనాతనం ధర్మం మీద వ్యాఖ్యలు...సుప్రీంకోర్టు నోటీసులు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దాని మీద విచారణ చేసిన కోర్టు ఉదయనిధికి నోటీసులను జారీ చేసింది. By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: విచారణకు హాజరు కావాల్సిందే-తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ విచారణకు హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది. కావాలంటే పదిరోజులు సమయం తీసుకోండి కానీ ఈడీ విచారణకు మాత్రం తప్పకుండా రావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. By Manogna alamuru 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavita: ఈడీ కోర్టుకు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్న కవిత ఢిల్లీ మద్యం స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు పంపించింది. దాని ప్రకారం ఆమె ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ విషయం తేలేవరకూ ఈడీ విచారణకు హాజరు కాకూడదని కవిత నిర్ణయించుకున్నారు. By Manogna alamuru 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై సుప్రీం జోక్యం చేసుకోవాలి.. సీజేఐకి 262 మంది ప్రముఖుల లేఖ.!! సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటనకు సంబంధించి 262 మంది ప్రముఖులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. ఉదయనిధి సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చడంపై వారు మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాకుండా నాశనం చేయాలని ఆయన అన్నారుని..సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తికి రాసిన లేఖలో పేర్కొన్నారు. By Bhoomi 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ JK Union Territory Status: జమ్ము రాష్ట్ర హోదాను ఎప్పుడు పునరుద్దరిస్తారు.... కేంద్రానికి సుప్రీం కోర్టు ప్రశ్న....! జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం కేవలం తాత్కాలిక చర్యేనని కేంద్రం పేర్కొంది. భవిష్యత్ లో జమ్ముకు మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రం వెల్లడించింది. జమ్ములో అన్ని పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. జమ్ములో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు విచారణ చేపట్టింది. By G Ramu 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇది రాజకీయ సమస్య అయితే..మేమేందుకు జోక్యం చేసుకోవాలి: సుప్రీం! ఏపీ విభజన బిల్లు పై విచారించే క్రమంలో సుప్రీం కోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం గురించి పిటిషనర్ ను ఇది ఎవరికి సంబంధించిన విషయం అంటూ ప్రశ్నలు సంధించింది. By Bhavana 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Supreme Court : అత్యాచార బాధితురాలి అబార్షన్‌కు అనుమతిస్తూ సుప్రీకోర్టు కీలక నిర్ణయం..!! అత్యాచార బాధితురాలి అబార్షన్ కు అనుమతిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థలో గర్భం దాల్చడం దంపతులకు ఆనందం ఇస్తుందని సుప్రీం తెలిపింది. కానీ ఒక స్త్రీ తన ఇష్టానికి విరుద్ధంగా గర్భవతి అయినప్పుడు..అది ఆమె మానసిక ఆరోగ్యానికి దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. గుజరాత్‌కు చెందిన అత్యాచార బాధితురాలికి అబార్షన్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 19న, ఈ అంశంపై విచారణ సందర్భంగా, గుజరాత్ హైకోర్టు వైఖరిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మెడికల్ బోర్డు నుండి తాజా నివేదికను కోరింది. By Bhoomi 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Lalu Prasad: లాలూకు భారీ షాక్.. బెయిల్ పిటిషన్ ను సవాల్ చేసిన సీబీఐ...! బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్ తగిలింది. దాణా కుంభకోణం కేసులో ఆయనకు మంజూరు చేస్తూ జార్ఖండ్ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేసింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై అగస్టు 25న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు వెల్లడించింది. By G Ramu 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bilkis Bano Case: అంతఘోరం చేసినవారికి క్షమాభిక్ష ఎందుకు? గుజరాత్ సర్కార్ కు సుప్రీం సూటిప్రశ్న..!! 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన బిల్కిస్ బానో కేసులో గుజరాత్ సర్కర్ వైఖరిపై దేశ అత్యన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌ల ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు వేసింది. కొంతమంది ఖైదీలకు రిమిషన్ పాలసీ ప్రయోజనం ఎందుకు వచ్చింది? అంటూ ప్రశ్నించింది. By Bhoomi 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn