Holidays : నేడు విద్యాసంస్థలకు సెలవు!
గత కొద్ది రోజులుగా ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.
గత కొద్ది రోజులుగా ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.
తెలంగాణలో హైస్కూల్ సమయాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు హైస్కూల్ టైమింగ్స్ ఉదయం 9.30 నుంచి 4.45 వరకు జరిగేవి. ఇక నుంచి ఆ సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు మార్చుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఎనిమిదో తరగతి వరకు కామన్ ఎగ్జామినేషన్ పరీక్షలను ఏపీ హైకోర్ట్ రద్దు చేసింది. దీనికి సంబంధించి ఈరోజు తీర్పును వెలువరించింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు పరీక్షలు నిర్వహించడం, విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 29కి వ్యతిరేకమని హైకోర్టు తీర్పు చెప్పింది.
ఏపీలో జూన్12 వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నెల 12 పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా 13న రీఓపెన్ అవుతాయని వెల్లడించింది. జూన్ 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద ప్రతి సంవత్సరం అందిస్తున్న ఉచిత పుస్తకాలు, యూనిఫాం, బూట్ల కిట్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేసింది
తెలంగాణలో జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలల పనివేళలు మారాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఉదయం 9.00 గంటలకే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం దీనికి ఆమోదం తెలిపారు.
రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు అన్ని రకాల మేనేజ్మెంట్ల పరిధిలోని పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఏపీలోని పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపింది. ఏప్రిల్ 23 పాఠశాలలకు చివరి వర్కింగ్ డే కాగా... నూతన విద్యా సంవత్సరానికి జూన్ 12 మొదటి రోజని పేర్కొంది.